
జోతిష్యశాస్త్రంలో ఈ ఏడాది జూన్ నెల చాలా కీలకమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే.. రాబోయే కాలంలో ముఖ్యమైన గ్రహాలు అన్నీ తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. శని గ్రహం మీన రాశిలో వక్రగతి మొదలుపెడుతుంది. గురు గ్రహం కూడా తన స్థానం మార్చుకుంది.
రాహు, కేతువులు కూడా తమ రాశులను మార్చుకున్నాయి. ప్రధాన గ్రహాలన్నీ తమ స్థానాలను మార్చుకోవడం వల్ల ఈ ప్రభావం ఆరు నెలల పాటు సాగనుంది. అంటే.. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి.
మరి, ఆ రాశులేంటో చూద్దాం.. గ్రహాలలో మార్పులు మకర రాశివారి జీవితంలో కొత్త మలుపులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. కెరీర్ లో మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారు కొత్త బాధ్యతలు చేపడతారు.లేదంటే..
కోరుకున్న కొత్త ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.మీ అదృష్టం రెట్టింపు అవుతుంది.ఇక వ్యాపారాలు చేసే వారికి కూడా మంచి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.
ఈ సమయంలో మీరు ఏం చేసినా మంచి విజయాలు అందుకుంటారు. గడిచే ఆరు నెలలు మిథున రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది. అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. చేసే ప్రతి పనిలోనూ విజయం వీరి సొంతం అవుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.
రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పెళ్లికాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నవారికి.. ఈ ఆరు నెలలు స్వర్ణయుగం కానుంది.పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
మీన రాశివారు ఏలినాటి శని దశలోనే ఉన్నారు. కానీ.. ప్రస్తుతం మీన రాశిలో శని వక్ర స్థితిలో కదలడం మొదలుపెట్టింది. దీని కారణంగా.. మీన రాశివారికి ఊహించని ప్రయోజనాలు
కలగనున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ పనిని అందరూ ప్రశంసిస్తారు. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. విద్యార్థులకు ఇది చాలా శుభకాలం. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు అందుకుంటారు.
ఈ ఏడాది చివరి ఆరు నెలలు కన్య రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా విజయం అందుకుంటారు. జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమౌతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులన్నీ పూర్తి అవుతాయి. పాత స్నేహితులు మీ కెరిర్ ఎదుగుదలకు బాగా సహాయం చేసే అవకాశం ఉంది.కొత్త అవకాశాలు ఎదురౌతాయి. కోర్టు సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే.. వాటిని పరిష్కరించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది.గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు.