
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మెటా (Meta) ఇటీవల పలు కీలక మార్పులు చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ టెక్ దిగ్గజం ఒక కొత్త అప్లైడ్ ఏఐ (Applied AI) విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఇందులోభాగంగా సుమారు 6,500 మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను వివిధ బృందాల నుంచి ఏఐ ప్రాజెక్టులపై పనిచేయడానికి బదిలీ చేశారు.
అయితే, కంపెనీ నిర్ణయంతో ఈ విభాగానికి బదిలీ అయిన సిబ్బంది అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై మెటా సీటీవో ఆండ్రూ బాస్వర్త్ (Meta CTO Andrew Bosworth) మాట్లాడుతూ.. ఏఐ పునర్ వ్యవస్థీకరణ విషయంలో కంపెనీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయిందని అంగీకరించారు.
కృత్రిమ మేధ విభాగాన్ని సరికొత్తగా తీసుకురావడంలో మెటా దారుణంగా వ్యవహరించిందని ఆండ్రూ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్ విజన్‌ను, విభాగాల మార్పుల వల్ల భవిష్యత్తులో ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలను తాము వారికి స్పష్టంగా తెలియజేయడంలో విఫలమయ్యామని అన్నారు.
మే నెలలో దాదాపు 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇవ్వడంతో పాటు, మిగిలిన సిబ్బందిని ఏఐ వైపు మళ్లించే క్రమంలో ఈ తప్పులు చోటుచేసుకున్నాయన్నారు. ఇటీవల మెటా సీఈవో జుకర్ బర్గ్ (Zuckerberg) కూడా ఇటువంటి అభిప్రాయమే వెల్లడించడం గమనార్హం.
కాగా కంపెనీ తీసుకున్న నిర్ణయంతో కృత్రిమ మేధ విభాగంలోని ఉద్యోగులు తమకు సృజనాత్మకత లేని పనులు కేటాయిస్తున్నారని.. దీనివల్ల తమ ఎదుగుదల తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. బలవంతపు బదిలీలు, 50 మంది ఉద్యోగులకు ఒకే మేనేజర్‌ను కేటాయించడం, ఏఐ టీమ్‌లో చేరడం తప్ప మరో అవకాశం ఇవ్వకపోవడం వంటి వాటిపైనా అంతర్గతంగా విమర్శలు వచ్చాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆయా