
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Business Ideas: రైతులకు చక్కటి లాభాలు కావాలి అంటే ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలి అంటే వ్యవసాయాన్ని మించిన మరొక మార్గం లేదు అని చెప్పవచ్చు. నేల తల్లిని నమ్ముకున్న వాడికి ఎప్పుడు మోసం జరగదు. సరైన పంటలను ఎంపిక చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకున్నట్లయితే వ్యవసాయం ని మించిన ఆదాయ మార్గం లేదు అని చెప్పవచ్చు.
కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందినటువంటి లోహిత్ శెట్టి అనే ఒక రైతు దక్షిణ కన్నడ జిల్లా, పెరడకా గ్రామంలో మాంగోస్టీన్ అనే అరుదైన పండ్ల జాతి మొక్కలతో వ్యవసాయం చేసి ప్రస్తుతం చక్కటి ఆదాయం పొందుతున్నాడు. ఈ మ్యాంగో స్టీన్ అనే పండు కేజీ ధర 650 రూపాయల వరకు పలుకుతోంది.
విదేశాల్లో మాత్రమే లభించే ఈ పండును ఫైవ్ స్టార్ హోటల్స్, అలాగే అరుదైన ఎగ్జోటిక్ పండ్ల మార్కెట్లలో భారీ డిమాండ్ కలిగి ఉంది. వీటిని విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. 2006 సంవత్సరంలో లోహిత్ శెట్టి తాను రెగ్యులర్ గా చేసే రబ్బర్ పంట, వక్క పంట సాగులో ఆదాయం తగ్గడంతో, ఇతర డిమాండ్ కలిగినటువంటి పంటలను పండించాలని నిర్ణయం తీసుకొని కేరళ వెళ్లి అక్కడ మాంగోస్టీన్, రాంబుటాన్ వంటి ఎక్సోటిక్ (అరుదైన) పండ్ల గిరాకీని దృష్టిలో ఉంచుకొని తనకు ఉన్నటువంటి వక్క పిక్కల తోటలో 50 మ్యాంగోస్టిన్ చెట్లను అంతర పంటగా వేసి చూశాడు.
నిజానికి మ్యాంగోస్టింగ్ చెట్లకు ఎక్కువగా ఎండ అవసరం లేదు. కనుక కొబ్బరి చెట్లలా పెరిగే వక్క పిక్కల తోటలో అంతర పంటగా వేయడం వల్ల, మ్యాంగోస్టింగ్ చెట్లకు నేరుగా ఎండ తాకలేదు
. వేడి ఎక్కువగా లేదని నేపథ్యంలో చక్కటి అనుకూలమైన వాతావరణం ఏర్పడి మ్యాంగోస్టిన్ పండ్ల పరిమాణం భారీగా పెరిగింది. దీంతో చక్కటి రాబడి వచ్చింది. దీనికి తోడు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల నీరు కూడా తక్కువగా ఖర్చు అయింది.
ఇక ఈ మ్యాంగోస్టీన్ చెట్ల విషయానికి వచ్చినట్లయితే, నాటిన 8 ఏళ్లకు ఫలసాయం మొదలవుతుంది. 15 ఏళ్లు దాటిన చెట్టు నుండి సీజన్‌కు 100 నుండి 120 కిలోల దిగుబడి వస్తుంది.ఒక కిలో మాంగోస్టీన్ ధర రూ. 650 వరకు పెరుగుతుంది. సీజన్ చివరలో దీని ధర రూ. 250 వరకూ పడే అవకాశం ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఈ పంటకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మాంగోస్టీన్ చెట్టు తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణానికి బాగా అలవాటుపడుతుంది.
సముద్ర తీర ప్రాంతాలు, అలాగే తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ చెట్టు బాగా పెరుగుతుంది. తక్కువ శ్రమతో, అరుదైన పండ్లను పండించి అధిక ఆదాయం పొందవచ్చు. అయితే ఇలాంటి అరుదైన మొక్కలతో వ్యవసాయం చేయాలి అనుకునే వారు ముందుగా వ్యవసాయ నిపుణుల వద్ద సలహా తీసుకుంటే మంచిది. . మీ నేల స్వభావం వాతావరణం వంటివి అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే ఇలాంటి అరుదైన మొక్కల వ్యవసాయం చేయవచ్చు. లేకపోతే రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.