
హైదరాబాద్: యువ ప్రతిభను వెలికితీయడంతోపాటు తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ (TG20 League 2026) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. జట్ల ఎంపిక, ప్లేయర్ల వేలం ఇప్పటికే పూర్తి కాగా అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తూ బిజిబిజీగా ఉన్నారు.
జూన్ 21 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. లీగ్‌లో ఎనిమిది జట్లు పోటీపడుతుండగా.. ప్రతి జట్టు మిగతా అన్ని టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడతుంది. తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ తలపడనున్నాయి.
జూన్ 23న పాలమూరుతో జరిగే మ్యాచ్‌తో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (Hyderabad e Champions) లీగ్‌ను ఆరంభించనుంది. జులై 7న లీగ్ దశ ముగుస్తుంది. 11న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. మ్యాచ్‌లన్నీ ఉప్పల్ స్టేడియంలో జరుగుతాయి. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు జులై 9న తొలి ఎలిమినేటర్ మ్యాచ్ తలపడతాయి.
ఇందులో ఓడిన టీమ్ ఇంటిముఖం పడుతుంది. గెలిచిన జట్టు రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. జులై 9న రాత్రి మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఢీకొంటాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది.
ఓడిన జట్టు జులై 10న రెండో ఎలిమినేటర్‌లో తొలి ఎలిమినేటర్ విజేతతో తలపడనుంది. విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. జులై 11న టైటిల్ పోరు ఉంటుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం
బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్‌లో ఐపీఎల్ తరహాలో క్రికెట్ సందడి మొదలుకానుంది. యువ ప్రతిభను వెలికితీయడంతోపాటు తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. దాయాది జట్టు పాక్‌పై భారత్ 64 పరుగుల తేడాతో నెగ్గింది. మ్యాచ్ హైలైట్స్ మీ కోసం..