
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రహ్మణి దంపతులు సోమవారం హైదరాబాద్లోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వారు మహాశివుడికి ఈ పూజలు చేశారు.పవిత్రమైన సోమవారం సందర్భంగా, వేద పండితుల మార్గదర్శకత్వంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి, శ్రేయస్సు, ప్రజా సంక్షేమం కోసం పరమశివుడి ఆశీస్సులు కోరుతూ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు.రుద్రాభిషేకం అనంతరం లోకేశ్, బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక హారతి కార్యక్రమంలో పాల్గొని, వేద పండితుల నుంచి ఆశీర్వచనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజల మేలు కోరుతూ మంత్రి దంపతులు ఈ పూజలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.దీనిపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
రుద్రాభిషేకం ఫొటోలను పంచుకున్నారు
.