
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Private school Student narrowly escaped from short circuit in Nalgonda: తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు ఈ రోజు (సోమవారం) అమావాస్య వేళ తెరుచుకున్నాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు, టీచర్లు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.
అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లు ప్రారంభించిన మొదటి రోజే విద్యార్థులకు అల్పాహారంతో పాటు పాలు పథకంను కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, నాణ్యమైన విద్య, డ్రాప్ అవుట్ లను తగ్గించడం, హజరు పెంచడంతో పాటు, ప్రభుత్వ విద్యను బలోపేతం దిశగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కాంగ్రెస్ మంత్రులు స్పష్టం చేశారు.
దీని కోసమే బడిబాటను ప్రారంభించినట్లు చెప్పారు. పాఠశాల మానేసిన విద్యార్థుల్ని తిరిగి బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు , టీచర్లు ప్రత్యేక చొరవ చూపించాలని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు రీఓపెన్ ను ఒక పండగలా నిర్వహించుకున్నారు.
విద్యార్థులు ఆనందంతో తమ పాఠశాలకు చేరుకున్నారు. మరోవైపు స్కూల్ సిబ్బంది పాఠశాలలను మామిడి తోరణాలు కట్టి అందంగా ముస్తాబు చేశారు. విద్యార్థులకు పూలు ఇచ్చి మరీ స్వాగతం పలికారు.ఈ క్రమంలో నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలోని స్కూల్ లో అనుకొని ఘటన చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు అనుకొని ఘటన చోటు చేసుకుంది. రామ్ చరణ్ అనే విద్యార్థి స్కూల్ గేటుకు తోరణాలు కడుతున్నాడు. ఇంతలో అతను కరెంట్ షాక్ కు గురై తీవ్ర గాయాల పాలయ్యాడు.
ఆస్పత్రికి తరలించారు.
Read more: Telangana Schools Reopen: అమావాస్య వేళ స్కూళ్లు తిరిగి ప్రారంభం.. విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ.!.
వైద్యులు విద్యార్థికి మెరుగైన వైద్యం అందించారు. కరెంట్ షాకు గురైన కూడా.. పెద్ద ప్రమాదం నుంచి సదరు విద్యార్థి రామ్ చరణ్ తప్పించుకున్నట్లు వైద్యులు తెలిపారు. స్కూల్ పక్కన ఇల్లు ఉండటంతో ఆడుకోవడానికి వెళ్లిన రామ్ చరణ్(13) అనే విద్యార్థితో ఉపాధ్యాయులు తోరణాలు కట్టించినట్లు బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. బాధితుడు కొండమల్లెపల్లిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్నాడు. ఈ ఘటనతో రామ్ చరణ్ తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. బాధిత బాలుడికి అండగా ఉంటామని ప్రభుత్వ పాఠశాల సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులకు భరోసాను ఇచ్చారు. పాఠశాల తొలిరోజే ఈ విధంగా జరగడంతో అందరు ఒకింత షాక్ కు గురౌతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
వెంటనే అతడ్ని గమనించిన సిబ్బంది దగ్గరలోని ప్రైవేటు