
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ - మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Virat Kohli - Ravi Shastri) మధ్య అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విరాట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా బాధ్యతలను నిర్వర్తించాడు.
వీరిద్దరి హయాంలో భారత్ విదేశాల్లో అద్భుతమైన టెస్టు విజయాలను నమోదు చేసింది. తాజాగా ఓ వీడియోలో విరాట్‌ను అహంకారి, అతి గారాబంతో పెరిగిన పిల్లాడు అంటూ పెట్టిన పోస్టుపై రవిశాస్త్రి స్పందించాడు. అవును ఆ అభిప్రాయాలు నిజమే కావొచ్చని..
అదంతా క్రికెట్ మైదానానికి మాత్రమే పరిమితమని స్పష్టంచేశాడు. గేమ్‌లోకి దిగిన ప్లేయర్.. మైదానం ఆవల ఉండే కోహ్లీ పూర్తి భిన్నమని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ‘‘అవునండీ.. మీరు అనుకున్నట్లు విరాట్ అహంకారి. అతి గారాబంగా పెరిగిన కుర్రాడు.
మితిమీరిన ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఉద్రేకంగా ఉంటాడు. ఇవన్నీ నిజమే. కానీ, ఇలా ఉండేది మాత్రం మైదానంలోనే. ఒక్కసారి గేమ్ నుంచి బయటకు వచ్చాక పూర్తి భిన్నం. మైదానంలో అలా ఉండి.. ఒక్కసారిగా దాన్నుంచి బయటకొచ్చి సాధారణంగా ఉండే వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం’’ అని రవిశాస్త్రి తెలిపాడు.
గాయం కారణంగా విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కూ దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ఆర్సీబీకి వరుసగా రెండో కప్పు రావడంలో కోహ్లీదే కీలక పాత్ర. ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టును గెలిపించాడు. అయితే, తొడ కండరాలు పట్టేయడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌లో ఆడటమే తన లక్ష్యమని ఇప్పటికే స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్‌లో ఐపీఎల్ తరహాలో క్రికెట్ సందడి మొదలుకానుంది. యువ ప్రతిభను వెలికితీయడంతోపాటు తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. దాయాది జట్టు పాక్‌పై భారత్ 64 పరుగుల తేడాతో నెగ్గింది. మ్యాచ్ హైలైట్స్ మీ కోసం..
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా