
Raghava Lawrence Political Entry : కోలీవుడ్‌లో మరో భారీ రాజకీయ ప్రకంపన మొదలైంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ మరియు సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తమిళనాడు రాజకీయ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైంది.
ప్రజలు, అభిమానుల నుంచి వ్యక్తమైన అపూర్వ మద్దతు నేపథ్యంలో.. తన పొలిటికల్ ఎంట్రీపై తాను “సానుకూల నిర్ణయం” తీసుకున్నట్లు లారెన్స్ స్వయంగా ప్రకటించారు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో.. లారెన్స్ తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి రాజకీయ ముఖచిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.
Read Also :CM Vijay Divorce Case: విజయ్ విడాకుల కేసులో నేడే కీలక విచారణ ఆదివారం చెన్నైలోని తన నివాసంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అభిమానులతో లారెన్స్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటను పంచుకున్నారు.
“చాలా కాలంగా నన్ను రాజకీయాల్లోకి రావాలని అనేకమంది ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా ప్రజలే నన్ను ఆహ్వానిస్తుండటంతో నేను ఈ విషయంలో ముందడుగు వేయాలని సానుకూల నిర్ణయం తీసుకున్నాను” అని లారెన్స్ పేర్కొన్నారు.త్వరలోనే తన తల్లి ఆశీస్సులు తీసుకుని, మద్దతుదారులతో ఒక భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించి, పార్టీ పేరు లేదా చేరికకు సంబంధించిన అధికారిక వివరాలను ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. లారెన్స్ నేరుగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విజయ్, తన తిరుచ్చి తూర్పు (Trichy East) నియోజకవర్గ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో (By-Election) టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్ బరిలోకి దిగుతారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. పాఠశాలలు, దేవాలయాల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేయాలన్న టీవీకే
పార్టీ ఆదర్శాలు, విధానాలను లారెన్స్ బహిరంగంగానే ప్రశంసించారు. ఇది కూడా ఆయన విజయ్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
గతంలో లారెన్స్ ఒక వీడియో సందేశం ద్వారా తన ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, తాను రాజకీయాల్లోకి రావాలా వద్దా అని ప్రజల ‘ఓటింగ్’ కోరారు. దానికి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఆధారంగానే లారెన్స్ ఈ పొలిటికల్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.
Samantha: ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో సమంత సరికొత్త రికార్డు.. ఒకే రోజు 40 ఇంటర్వ్యూలు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Telangana Politics: 2028 ఎన్నికల్లో పాలమూరులో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ ఖాయం: కేటీఆర్
CM Vijay Divorce Case: విజయ్ విడాకుల కేసులో నేడే కీలక విచారణ
Cong Launches Anti-Paper Leak Campaign : పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా మొదలైన రాహుల్ ప్రచారం
AP Politics: తిరుపతి కూటమి సభలో అన్నీ అబద్ధాలే: షర్మిల!
CJP announces ‘Exam Manifesto’ : ‘పరీక్షల మేనిఫెస్టో’ను ప్రకటించిన CJP: నీట్ వివాదంపై దేశవ్యాప్త నిరసనలు
Kolkata fire incident: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం.. కాలిపోయిన 4,000 ఈవీఎంలు