
హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇవాళ వెయ్యికిపైగా స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన 150కిపైగా బస్సులపై కేసు నమోదు చేశారు. ఫిట్నెస్ లేని 35 విద్యాసంస్థల వాహనాలను సీజ్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి.
దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. పాఠశాలలకు తొలిరోజు వస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అల్పాహారం ఏర్పాటు చేశారు. ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. వేసవి సెలవులతో బోసిపోయిన పాఠశాలలు సందడిగా మారాయి
.