
బరువు తగ్గడం అనేది వివిధ రకాల డైట్లు, వర్కౌట్ల సమాహారం. అందుకు తగిన ఓపిక, నిలకడ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఉండాలి. ముఖ్యంగా భారంగా కాకుండా ఇష్టంగా ఆరోగ్య కోసం అనే స్పృహతో సులభంగా బరువు తగ్గొచ్చని చాలామంది నిరూపించారు.
ఆ కోవకు చెందిన వ్యక్తే బాలీవుడ్ హీర్ కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘చందు ఛాంపియన్’ కోసం ఏకంగా 18 కిలోలు ఎలాంటి మందులు వాడకుండా సహజ పద్ధతిలో తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం ఆర్యన్ ఎంతలా కష్టపడ్డాడో తెలిస్తే..స్మార్ట్‌గా మారాలంటే మన నుంచి కనీసం ఈ మాత్రం కష్టం ఉండక తప్పదని అంగీకరిస్తారు.
మరి ఆర్యన్ ఏకంగా 90 నుంచి 72 కిలోలు బరువు తగ్గేందుకు ఏం చేశాడో సవివరంగా తెలుసుకుందామా..!. సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రపంచం మర్చిపోయిన భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత మురళీకాంత్ పేట్కర్ పాత్రలో కార్తిక్ ఒదిగిపోయారు.
ఆయన ఆ పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసినట్లు తన ఆకృతిని మార్చుకున్నారు. ఆర్యన్ నటనకు విమర్శకు ప్రశంసలందుకున్నప్పటికీ..ఆ సినిమాకి అయ్యిన వ్యయానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. కారణాలు ఏవైనా..ఈ మూవీ ఓటమిని అంగీకరించిన ఓ క్రీడాకారుడి కథ.
గాయలు, ఎదురుదెబ్బల నుంచి పతకాలు దక్కించుకున్ను శక్తిమంతమైన క్రీడాకారుడి స్టోరీ. మరి ఆ పాత్ర ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడ్ని చేసేలా ఉండాలంటే..ఆర్యన్ ఆ యోధుడి రూపంలోకి మారక తప్పదు. ఆ నేపథ్యంలోనే 90 కేజీల బరువు ఉండే ఆర్యన్ 72 కిలోలకు తగ్గేలా శిక్షణ తీసుకున్నారు.
ఎలాంటి మందులు వినియోగించకుండా నేచురల్ పద్ధతిలో బరువు తగ్గడం విశేషం. వెయిట్‌లాస్ కోసమే ఆర్యన్ బాక్సింగ్ శిక్షణ తీసుకోవడం నుంచి ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వరకు ఎన్నో త్యాగాలు, ఎంతో శారీరక శ్రమ దాగి ఉంది. ఆయన ఫిట్నెస్ శిక్షణ అందించిన త్రిదేవ్
Jun 15 2026 10:16 AM | Updated on Jun 15 2026 10:34 AM
బరువు తగ్గడం అనేది వివిధ రకాల డైట్లు, వర్కౌట్ల సమాహారం. అందుకు తగిన ఓపిక, నిలకడ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఉండాలి. ముఖ్యంగా భారంగా కాకుండా ఇష్టంగా ఆరోగ్య కోసం అనే స్పృహతో సులభంగా బరువు తగ్గొచ్చని చాలామంది నిరూపించారు. ఆ కోవకు చెందిన వ్యక్తే బాలీవుడ్ హీర్ కార్తిక్ ఆర్యన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన హిందీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘చందు ఛాంపియన్’ కోసం ఏకంగా 18 కిలోలు ఎలాంటి మందులు వాడకుండా సహజ పద్ధతిలో తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకోసం ఆర్యన్ ఎంతలా కష్టపడ్డాడో తెలిస్తే..స్మార్ట్‌గా మారాలంటే మన నుంచి కనీసం ఈ మాత్రం కష్టం ఉండక తప్పదని అంగీకరిస్తారు. మరి ఆర్యన్ ఏకంగా 90 నుంచి 72 కిలోలు బరువు తగ్గేందుకు ఏం చేశాడో సవివరంగా తెలుసుకుందామా..!.
సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రపంచం మర్చిపోయిన భారతదేశపు మొట్టమొదటి పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత మురళీకాంత్ పేట్కర్ పాత్రలో కార్తిక్ ఒదిగిపోయారు. ఆయన ఆ పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసినట్లు తన ఆకృతిని మార్చుకున్నారు. ఆర్యన్ నటనకు విమర్శకు ప్రశంసలందుకున్నప్పటికీ..ఆ సినిమాకి అయ్యిన వ్యయానికి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. కారణాలు ఏవైనా..ఈ మూవీ ఓటమిని అంగీకరించిన ఓ క్రీడాకారుడి కథ.
గాయలు, ఎదురుదెబ్బల నుంచి పతకాలు దక్కించుకున్ను శక్తిమంతమైన క్రీడాకారుడి స్టోరీ. మరి ఆ పాత్ర ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడ్ని చేసేలా ఉండాలంటే..ఆర్యన్ ఆ యోధుడి రూపంలోకి మారక తప్పదు. ఆ నేపథ్యంలోనే 90 కేజీల బరువు ఉండే ఆర్యన్ 72 కిలోలకు తగ్గేలా శిక్షణ తీసుకున్నారు. ఎలాంటి మందులు వినియోగించకుండా నేచురల్ పద్ధతిలో బరువు తగ్గడం విశేషం. వెయిట్‌లాస్ కోసమే ఆర్యన్ బాక్సింగ్ శిక్షణ తీసుకోవడం నుంచి ఆహారం నుంచి చక్కెరను పూర్తిగా తొలగించడం వరకు ఎన్నో త్యాగాలు, ఎంతో శారీరక శ్రమ దాగి ఉంది.
ఆయన ఫిట్నెస్ శిక్షణ అందించిన త్రిదేవ్ పాండే సైతం నిజమైన బాక్సర్ అనుసరించే శిక్షణా విధానాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నెలల తరబడి కఠినమైన క్రమశిక్షణ, నిరంత కృషి ఉందన్నారు. అయితే ఆయన మొదట్లో ఒక్క పుష్ అప్ కూడా చేయలేకపోయారని, కానీ క్రమంగా వీపుపై 50 నుంచి 60 కేజీల అదనపు బరువుతో వాటిని చేసే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా అతని స్కిప్పింగ్ కూడా మెరుగపడింది. ప్రాథమిక ఫుట్‌వర్క్‌తో ఇబ్బందుల నుంచి సుమారు 14 నుంచి 15 ఇతన ఆధునతాన జిమ్ వర్కౌట్లు చేసే స్థాయికి చేరుకున్నారు.
అంతేగాదు అనుకున్నట్లుగానే 14 నెలల్లో 18 కేజీలు తగ్గి అద్భుతంగా కనిపించడమే కాదు, ఆ పాత్రకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలందుకున్నారు కార్తీక్ ఆర్యన్. చెయ్యాలి అని బలంగా అనుకుంటే..ఎన్ని కష్టాలకైనా ఓర్చి..అనుకున్నది సాధిస్తాం అనేందుకు హీరో కార్తీక్ ఆర్యన్నే ఉదాహరణ.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని అనుసరించడం ఉత్తమం.
(చదవండి: 92 ఏళ్ల టీచరమ్మ ఫిట్నెస్కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం..)
'అందరి చూపు అటువైపే' ఏముంది అక్కడ..(ఫొటోలు)
ముంబై : 'ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్' 25 ఏళ్ల వేడుక (ఫొటోలు)
‘సింగ్-గీతం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
మహిళల జట్టు టి20 ప్రపంచకప్...పాకిస్తాన్‌పై భారత ఘనవిజయం (ఫొటోలు)
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
మీరు చేసే పని.. జగన్ చేస్తే తట్టుకోగలరా..
మా అమర్నాథ్ జోలికొస్తే.. నాలుక చీరేస్తాం..! వంగలపూడి అనితపై YSRCP నేతలు ఫైర్
గాలి ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఆరుగురు మృతి