
సింగపూర్ సిటీ: సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు అక్కడి భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు.
ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను వివరించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు. ‘‘రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి రైతులు ముందుకొచ్చారు.
ఏపీ రైతులు ప్రపంచస్థాయి నాణ్యమైన ఉత్పత్తులు పండిస్తున్నారు. ఉద్యాన పంట ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నాం. రోబోటిక్స్, మెడికల్ డివైసెస్, హార్డ్‌వేర్ రంగాల్లో సహకారం కావాలి. సింగపూర్ టెక్ అవసరాలు తీర్చేందుకు ఏపీ యువత సిద్ధంగా ఉంది.
పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రసీలో జాప్యం లేకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారు. పెట్టుబడులతోనే అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి సాధ్యమవుతుంది. భారత్‌ను నంబర్ 1 చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ప్రధాని చొరవ కారణంగా ప్రపంచస్థాయి సంస్థలు ఏపీకి వచ్చాయి’’ అని చంద్రబాబు అన్నారు. సింగపూర్ వర్సిటీలు, ఏపీ విద్యాసంస్థలకు మధ్య భాగస్వామ్యానికి కృషి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ ఎకో సిస్టంలో సింగపూర్ చాలా ముందుందని శిల్పక్ అంబులే అన్నారు.
భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు సింగపూర్ ఆసక్తిగా ఉందని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
లేదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు