
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మార్కెట్లో బంగారం, వెండికి మళ్లీ గిరాకీ పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు దిగిరావడం, రూపాయి విలువ బలోపేతం వంటి కారణాలతో ఈ లోహాల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్ విపణిలో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,490 పలికింది.
అటు వెండి ధర కూడా ఎగబాకింది. కేజీ వెండి ధర రూ.2.57లక్షలకు చేరింది. గతవారం ఒకదశలో బంగారం ధర రూ.1,50,000 కన్నా దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ విపణిలోనూ బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,323 డాలర్లు, ఔన్సు వెండి ధర 70.38 డాలర్లకు చేరింది.
గతవారం పసిడి ధర ఒక దశలో దాదాపు 4000 డాలర్లకు తగ్గింది. ఇక, కమొడిటీ ఎక్స్ఛేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,53,258గా ఉంది. వెండి ఫ్యూచర్స్ ధర రూ.2,52,383గా ట్రేడ్ అవుతోంది. ఇరాన్‌తో డీల్ కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
దీంతో మూడు నెలలకు పైగా సాగిన యుద్ధానికి ముగింపు లభించినట్లయ్యింది. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు భారీగా దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ 83 డాలర్లకు పడిపోయింది. అటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 53 పైసలు బలపడి 93.65 వద్ద ట్రేడ్ అవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.