
మహిళల టీ20 ప్రపంచకప్ 2026ను భారత జట్టు ఘనంగా ప్రారంభించింది. నిన్న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 64 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 18,814 మంది ప్రేక్షకులు హాజరుకావడం, టోర్నీ చరిత్రలోనే ఓ గ్రూప్ మ్యాచ్‌కు ఇదే అత్యధికం కావడం విశేషం.మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో పోటెత్తిన అభిమానులు ఈ మ్యాచ్ ప్రేక్షకుల హాజరులో ఓ కొత్త చరిత్రను లిఖించింది.
2024లో దుబాయ్‌లో ఇదే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరైన 15,935 మంది రికార్డును ఈ మ్యాచ్ అధిగమించింది. మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు, భారత్-పాక్ మ్యాచ్‌లకున్న క్రేజ్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది. ఈ విజయంతో గ్రూప్ 1లో భారత్ తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడమే కాకుండా టోర్నీని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది.
భారత జట్టు ప్రదర్శనపై సచిన్ టెండూల్కర్ సహా పలువురు క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68) అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టుకు బలమైన పునాది వేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 35 పరుగులు చేయగా, చివర్లో రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 34 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
భారత బ్యాటర్లు చివరి 10 ఓవర్లలో ఏకంగా