
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధికం ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత ఈనాడు, హైదరాబాద్: ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ సూచించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు పసుపు రంగు (5 సెం.మీ.వరకు) హెచ్చరికలు జారీ చేసింది. 15, 16, 17 తేదీల్లో ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణలోకి ఈ నెల 8న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తరువాత కొద్దికొద్దిగా కదిలి 11వ తేదీ నాటికి హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాలకు విస్తరించాయి. ఆ తరువాత వాటి కదలిక పూర్తిగా నెమ్మదించింది. రాష్ట్రమంతటా విస్తరించడానికి మరో నాలుగు రోజులు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను ఇంకా పవనాలు స్పృశించలేదు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, ములుగు, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లోని అత్యధిక మండలాల్లో 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.