
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరి డిపోనకు చెంది
న బస్సు ఆదివారం తెల్లవారుజామున చింతామణి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 20 మందికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన 10 మందిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.