
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Meenakshi Natarajan Nomination Rejection: 'మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా? అనుమానం కలుగుతుంది. కేసు లేదు ఏమి లేదు నోటీసు మాత్రమే ఇచ్చింది. ఎఫ్ఐఆర్ లేనపుడు కేసు ఎక్కడిది?' అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. 'పసలేని కేసును పట్టుకొని దుర్బుద్ధితో నోటీసు మాత్రమే ఇచ్చింది. ఆర్ఓకి తిరస్కరించే అధికారం లేకున్నా తిరస్కరించారు. ఆర్ఓని ఉరి వేసిన తప్పులేదు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రాజ్యసభలో బలం పెంచుకోవాలని కుట్రకు పూనుకున్నారు. గాంధేయ వాది నియయితికి నిలువుటద్దం మీనాక్షి నటరాజన్. ప్రధానమంత్రి కార్యాలయం చొరవతో కేసును తప్పుదోవ పట్టించారు. ఈ విషయంలో ఉరి వేసిన తప్పులేదు' అని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ తెలిపారు. రాజకీయ ఒత్తిడితో ఆర్ఓ ఆఫీసులో కూర్చుని ప్రధాని నియంతలా వ్యవహరించడం శోచనీయం అని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదు అసహనం వ్యక్తం చేశారు. 'బీజేపీ ఫాసిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీనాక్షి నాకు సోదరి లాంటివారు. 24 గంటల్లో ఎన్నికల సంఘం స్పందించకపోవడం విచారకరం. మీనాక్షిని బలి చేశారు. మీనాక్షి విషయంలో కొంత మంది బీజేపీ నాయకులు సానుభూతి తెలిపినట్లు తెలిసింది. బీజేపీ నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. లీకు వీరులు, గ్రీకు వీరులు ఉంటే రేవంత్ రెడ్డి సమగ్రంగా విచారిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మాపై బురద జల్లుతున్నారు' అని మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. 'రాజకీయాల్లో విభేదాలు సహజం. అంతమాత్రాన కుట్రకు పాల్పడరు. ఓటు చోరీ చేసి.. ఇప్పుడు సీటు చోరీ చేశారు. ప్రధాని ఇంతలా
దిగజారి ప్రవర్తించడం సిగ్గుచేటు' అని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. 'మీనాక్షికి కేసుకు అసలు సంబంధం లేదు. రాజ్యాంగాన్ని ఇంత దుర్మార్గంగా అవమానిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఇలా వ్యవహరిస్తే మోడీ ప్రధాని అయ్యేవారా?ముఖ్యమంత్రి అయ్యేవారా?' అని ప్రశ్నించారు.
'పశ్చిమ బెంగాల్, మహరాష్ట్రలో బీజేపీ ఏం చేసిందో దేశ ప్రజలు చూశారు. 12 ఏళ్లలో మోదీ చేసింది ఏమి లేదు' అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ విమర్శించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపణలపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన ఆస్తులు, తన వ్యక్తిత్వం ఏమిటో నిజామాబాద్ ప్రజలకు తెలుసు అని చెప్పారు. 'చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డి సమక్షంలో చేర్పించారు. షబ్బీర్ అలీకి షోకాజ్ ఇచ్చాం' అని వివరించారు. 'ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్న షబ్బీర్ అలీ అలా మాట్లాడటం సబబు కాదు. మహిళలను చులకన చేసి మాట్లాడటం విచారకరం. ఏడాది కిందటి మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది' అని మహేశ్ కుమార్ వెల్లడించారు.