
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులను 5 నెలల్లో పూర్తి చేస్తామని డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. విజయవాడ విమానాశ్రయానికి తలమానికంగా నిలిచే ఏటీఎస్ కాంప్లెక్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.
వారణాసికి కొత్త సర్వీస్ ఆగస్టులో ప్రారంభమవుతుందని, ఈ సర్వీస్‌తో కోల్‌కతా కూడా అనుసంధానమవుతుందని తెలిపారు. దేశీయంగా కొచ్చిన్, అహ్మదాబాద్, జైపుర్ నగరాలకు కొత్త సర్వీసును నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
పశ్చిమాసియా యుద్ధంతో ఆగిన షార్జా సర్వీసును పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి ప్రారంభిస్తామని, దుబాయ్, శ్రీలంకకు కూడా సర్వీస్‌ను నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న లక్ష్మీకాంత్‌తో ముఖాముఖి. ఈ వార్త చదివారా: అమరావతిపై వైకాపా దుష్ప్రచారాలు మానకపోతే ఆ 11 సీట్లు కూడా రావు: నారాయణ