
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది ‘పెద్ది’. అయితే, అదే సమయంలో కథానాయిక పాత్ర చిత్రీకరణ, ప్రజెంట్ చేసిన విధానంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ విషయమై దర్శకుడు బుచ్చిబాబు వివరణ కూడా ఇచ్చారు.
తాజాగా మరో అంశంపై ఆయన తన మనసులో మాట చెప్పారు. ముఖ్యంగా, ‘పెద్ది’ ట్రైలర్ సినిమాపై గట్టి ప్రభావాన్ని చూపించలేకపోయిందని అభిప్రాయపడ్డారు. కథా సారాన్ని ట్రైలర్ ప్రతిబింబించ లేకపోయిందన్నారు. విమర్శకులకు అవకాశమిచ్చినట్లు అయిందన్నారు.
ఇందులో అప్పలసూరి పాత్ర పోషించిన జగపతిబాబు, దర్శకుడు బుచ్చిబాబుల మధ్య చిట్‌చాట్ జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్ గురించి జగపతిబాబు (Jagapathi Babu) మాట్లాడుతూ.. ‘సినిమా ట్రైలర్ విడుదలయ్యాక కొంత నెగెటివిటీ వచ్చింది. అది చూసిన తర్వాత సినిమాలో ఇంకా ఏ తప్పులున్నాయో వెతుకుదామనే ఆలోచనతో వచ్చారు.
మరికొందరు సినిమాను భుజాలపైకి ఎత్తుకోవాలన్న ఉద్దేశంతో వచ్చారు. నేను కూడా మొదట్లో అంచనాలను అందుకోదేమోనుకున్నా. పెద్ద సినిమా విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకూడదు. కానీ జరిగిపోయింది’ అని అభిప్రాయపడగా, అందుకు బుచ్చిబాబు బదులిస్తూ ‘అవునండీ..
కథకు సంబంధించిన అనేక అంశాలను ట్రైలర్లో చూపించాం. దీంతో అంతా ఇరికించేసినట్లు అయింది’ అంటూ జగపతిబాబు అభిప్రాయంతో ఏకీభవించారు. ఇక చాలా మంది ‘పెద్ది’కి రివ్యూలు ఇచ్చారని, వాటికి లక్షల్లో లైక్‌లు వచ్చాయన్నారు. మూవీ బాగుందంటూ ఇన్ని రివ్యూలు ఇటీవల కాలంలో ఏ సినిమాకూ చూడలేదని బుచ్చిబాబు తెలిపారు.
తన తర్వాతి సినిమా పూర్తి మాస్, యాక్షన్‌తో ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా నటుడు జగపతిబాబు తనకు ఎదురైన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు. ‘‘పెద్ది’ మూవీ చూసిన ఓ పెద్ద దర్శకుడు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ‘ఇదేం ఖర్మండీ బాబూ..!
అన్నారు’’ అంటూ జగపతిబాబు తెలిపారు. ఒక సన్నివేశం కోసం జగపతిబాబు 75 టేక్స్ తీసుకున్నారన్న విషయంపైనా దర్శకుడు బుచ్చిబాబుతో (peddi director) స్పష్టత ఇప్పించారు. ఒకట్రెండు టేక్స్కు మించి ఎప్పుడూ చేయలేదన్నారు. మరోవైపు ‘పెద్ది’ 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.366కోట్లు (గ్రాస్) వసూలు (peddi movie collection) చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా నిలిచింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్‌దర్శన్ దర్శకుడు. గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది.
మీరు చేసిన అప్పలసూరి పాత్ర మలయాళ, తమిళ, హిందీ నటుడో చేసి ఉంటే ఈ పాటికి ప్రశంసలతో ఆయన్ను ఎక్కడో కూర్చోబెట్టేవారు. మీరు తెలుగు వాడు కావటం మీ దురదృష్టం’ అని నాతో