
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Husband Wife Solution Tips: భారతదేశం అనేక సంప్రదాయాలకు నెలవు. మన సమాజంలో భార్యాభర్తల అనుబంధానికి ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. కుటుంబ శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి, భర్త విజయానికి సంబంధించిన కొన్ని ఆచారాలను, నమ్మకాలను మన పెద్దలు పాటిస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా భర్త ఏదైనా పని కోసం ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే భార్యలు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం, జానపద విశ్వాసాలు చెబుతున్నాయి. ఇవి శాస్త్రీయంగా నిరూపితం కాకపోయినా.. తరాలుగా వస్తున్న కొన్ని సంప్రదాయ నమ్మకాల ప్రకారం ఏ పనులు భార్యలు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
భర్తలు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత భార్యలు చేయకూడని ఏడు పనులు ఏమిటంటే.. ఇల్లు ఊడవడం, తుడవడం.. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు ఊడవడం లేదా కడగడం వంటి పనులు చేయకూడదట. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది అనే చాలా మంది నమ్ముతారు.
ఈ క్రమంలో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే కాకుండా కొంత సమయం తర్వాతే ఆ పనులు చక్కదిద్దుకోవడం మంచిది. తలస్నానం చేయటం.. భర్త ముఖ్యమైన పనిపై ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే భార్య తలస్నానం చేయడం సరైన పద్ధతి కాదని కొన్ని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.
ఇలా చేయడం వల్ల భర్త చేపట్టే పనులు ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్నారు. జడ వేసుకోవడం, గోళ్లు కత్తిరించడం.. కొంతమంది భర్త బయటకు వెళ్లిన వెంటనే వారివారి భార్యలు తల దువ్వుకోవడం మేకప్
లు వేసుకోవడం, ఆభరణాలతో ముస్తాబవ్వటం వంటివి చేస్తుంటారు. అయితే జానపద నమ్మకాల ప్రకారం.. భర్త సురక్షితంగా తన పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేవరకు భార్యలు తమ అలంకరణలను తొలగించకపోవడం మంచిది.
వంటగదిని, పాత్రలను శుభ్రం చేయటం.. భర్త భోజనం చేసిన వెంటనే లేదా ఇంటి నుంచి బయటకు బయలుదేరిన వెంటనే అతని ఎంగిలి పాత్రలు తోమటం వంటి సాంప్రదాయం నివారించ మంటారు. అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఇంట్లో ఉండాలంటే కొంతసేపు ఆగి ఈ పనులు చేయాలని మన పెద్దలు సూచిస్తున్నారు.
ఉప్పు లేదా పదునున్న వస్తువులు అప్పు ఇవ్వటం.. భర్తలు ఇంటి నుంచి బయటకు వెళ్లి నా వెంటనే పొరుగు ఇంటి వారికి భార్యలు తమ ఇంట్లోని ఉప్పు, సూది, కత్తెర, కత్తి వంటి మొదలైన వస్తువులను అప్పుగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు తగ్గి ప్రతి పనిలో నష్టం చేకూరి అవకాశం ఉందని పెద్దలు నమ్ముతారు.
గుమ్మం ఎదుట నీళ్లు చల్లడం లేదా కాలిపాత్రను ఉంచడం.. భర్త ఇంటి నుంచి బయటికి వెళ్లిన వెంటనే ముఖద్వారం ఎదుట నీళ్లు చల్లడం ఆశుభ సూచికంగా భావిస్తారట. అలాగే ఇంట్లో నీటి బకెట్లు, కుండలు పూర్తిగా ఖాళీగా ఉంచకూడదట. ఒకవేళ ఖాళీ పాత్రలను బోర్లించి లేదా తలకిందులుగా ఉంచటం మంచిదని జానపద విశ్వాసకులు చెబుతున్నారు.
(గమనిక: పైన పేర్కొన్న విషయాలు జ్యోతిష్య నమ్మకాలు లేదా జానపద విశ్వాసాల ఆధారంగా మాత్రమే పొందుపరచబడింది. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని పాటించాలా లేదా అనేది మీ పూర్తి వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ఈ సమాచారాన్ని ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.