
తుని: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది. చిన్నారి గాలింపు చర్యల్లో భాగంగా అంతకుముందు ఈ శునకానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చారు.
80 నిమిషాలపాటు పలు ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల మేర సంచరించిన ఆ కుక్క తిరిగి ఇంటికి చేరుకుంది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. కుక్క మృతితో దర్యాప్తునకు సంబంధించి పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు.
మరోవైపు.. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తిరుపతి జిల్లా తడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు దగ్ధమైంది
.