
Razorpay IPO | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పే తొలి పబ్లిక్ ఆఫర్‌కు (Razorpay IPO) వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను కాన్ఫిడెన్షియల్ రూట్లో సెబీకి దరఖాస్తు చేసినట్లు సమాచారం.
పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.5-6 వేల కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన ప్రీ ఫైల్డ్ ముసాయిదా పత్రాలను సెబీకి, స్టాక్ ఎక్స్చేంజీల్లో కంపెనీ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది.
ఐపీఓ ద్వారా ఎంత సమీకరించేదీ కంపెనీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. 2014లో హర్షిల్ మాథుర్, శశాంక్ కుమార్ రేజర్పేను నెలకొల్పారు. డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ పేమెంట్ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. మరోవైపు, ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కూడా ఐపీఓకు రానుంది.
అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా తన పబ్లిక్ ఇష్యూను వాయిదా వేస్తూ వస్తోంది. 1.5 బిలియన్ డాలర్ల నిధులను ఐపీఓ ద్వారా సమీకరించే అవకాశం ఉంది. ఈక్రమంలోనే రేజర్‌పే ఐపీఓకు వస్తుండటం గమనార్హం. పోటీదారులకు మేలు చేకూర్చే సున్నిత సమాచారమేదీ బయటకు రాకుండా కంపెనీలు ఈ కాన్ఫిడెన్షియల్ రూట్‌ను ఎంచుకుంటూ ఉంటాయి.
సెబీ అనుమతి పొందేవరకు ఆ వివరాలేవీ పబ్లిక్ డొమైన్‌లోకి రావు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.