
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Shankara Vidyalaya: శక్తిసాయి నగర్లో కొత్తగా ‘శంకర విద్యాలయ’ స్కూల్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారు. ఇక ఏదైనా స్కూళ్లు పెట్టాలంటే వాటికి నిర్దిష్టమైన అనుమతులు ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఉండాలి. ఈ కాలనీలో ఇంటి కోసం పర్మిషన్ తీసుకొని.. ఆయా స్థలంలో ఇపుడు అక్రమంగా స్కూలును ఏర్పాటు చేశారు. దాని కోసం సరైన అనుమతులు తీసుకున్నారా అంటే అది లేదు. ముఖ్యంగా స్కూళ్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా.. వెనకాల పార్క్ ను ఆక్రమిస్తూ ఈ స్కూల్‌ను కట్టారు. ఏదైనా ప్రమాదం జరిగితే..ఫైర్ ఇంజిన్ స్కూల్ చుట్టు తిరిగేలా ఉండాలి. కానీ కొంత మంది అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఇలాంటి అక్రమ స్కూళ్లకు పర్మిషన్స్ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అసలు ఈ స్కూల్ ఫైర్ డిపార్టెంట్ నుంచి ఎన్ఓసీ సర్టిఫికేట్ తీసుకున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది. అసలు నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ఈ కట్టడానికి మున్సిపల్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది.
ముఖ్యంగా అనుమతులు లేకుండానే శంకర విద్యాలయా మాదిరే అనేక పాఠశాలలు నడిపించడం.. విద్యార్ధుల తల్లిదండ్రుల నుండి ముక్కుపిండి స్కూలు ఫీజులు వసూలు చేయడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా పాఠశాల పెడితే.. దానికి ముందుగా స్కూలు గ్రౌండ్ ఉండాలి. వాహనాలు పార్కింగ్, ఫర్నీచర్, ల్యాబ్ వంటివి వసతులుండాలి. ఇలాంటేవి లేకుండా స్కూలు పర్మిషన్ కోసం అప్లై చేయడం.. అనుమతులు రాకున్నా.. స్కూలు రన్ చేయడం వంటివి చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని స్కూళ్లో విద్యార్ధుల తల్లిదండ్రులను మభ్యపెట్టి మరి పిల్లలను చేర్చుకుంటున్నారు. పేరేంట్స్ కూడా తమ పిల్లలను స్కూళ్లో జాయిన్ చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచిస్తూ బెటర్ అని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.
విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేనందున ఈ పాఠశాలకు సంబంధించిన బోర్డును నిర్వాహకులు .. లోపల పెట్టి జోరుగా అడ్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. విద్యాశాఖకు సంబంధించిన ఎలాంటి అనుమతులు లేవు. కనీసం బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు. విద్యాశాఖ అధికారులు వెంటనే మేల్కొని కాలనీలో వాళ్ల అనుమతి లేకుండా పెట్టిన ఈ స్కూలును మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఎలాంటి పార్క్ సౌకర్యం లేని ఈ స్కూల్లో విద్యార్ధులను ఎలా ఆడిస్తారనేదానికి మరో ప్రశ్న. దానికి వాళ్లు స్కూలు ఎదురుగా ఉన్న పార్కులో విద్యార్ధులు ఆడుకునేలా చేస్తామని గడుసు సమాధానం ఇచ్చారు స్కూలు నిర్వాహకులు. కాలనీ ప్రజలు సేద తీరడం కోసం కట్టిన పార్కుల్లో మొక్కలు, పుట్టల మధ్య ఈ స్కూల్ పిల్లలను ఎలా ఆడిస్తారని అందరు ప్రశ్నిస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేని ఈ స్కూలు ఓపెనింగ్‌కు తగుదునమ్మా అంటూ స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి వచ్చి ఈ స్కూలును ప్రారంభోత్సవం చేయడం పై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రజా ప్రతినిధి స్కూలు కానీ మరేదైనా కానీ ఓపెన్ చేసినపుడు ప్రభుత్వ శాఖల నుంచి సరైన అనుమతులు ఉన్నాయా లేవా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. లేకపోతే ప్రజల్లో నవ్వులపాలు కాతప్పదు. సదరు స్కూలుకు ఎలాంటి పర్మిషన్ లేదని స్థానిక ఉప్పల్ ఎంఈవో రామారావు తెలిపారు. అనుమతులు లేని స్కూళ్లో చేర్పించవద్దని ఆయన విద్యార్ధుల తల్లితండ్రులను కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.