
భాగ్యనగరంలో వచ్చే మరికొన్ని గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై, ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో వచ్చే మరికొన్ని గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై, ఉరుములు–మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే 48 గంటల పాటు కొన్ని జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేశారు. అయితే, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి వంటి పరిసర జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉందని తెలిపారు.
ట్రాఫిక్ జామ్‌లు, జలమయం సమస్యలు రావచ్చని చెప్పుకొచ్చారు. చెట్లు, పాత నిర్మాణాల దగ్గర తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌కు ఐఐఎం కావాలి..
కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి విద్యానాణ్యత మెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. డీఈఓలకు కీలక ఆదేశాలు
..
Read Latest Telangana News And AP News And National News