
Pawan Kalyan On Telangana: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 'జనసేన ప్రస్థానం - జాతీయ సమగ్రత కోసం' సమావేశాన్ని జనసేన పార్టీ ప్రారంభించింది. జనసేన పార్టీని ప్రారంభించి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరును తప్పుబట్టినట్లు ఆయన ప్రస్తావించారు
.