
హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు జనాల్ని భయపెట్టింది. రాంగ్ రూట్లో ఆ డ్రైవర్ వేగంగా దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే.. ఓ బైకర్ ఆ బస్సును అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా నడిచింది
Jun 13 2026 12:34 PM | Updated on Jun 13 2026 12:46 PM
హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు జనాల్ని భయపెట్టింది. రాంగ్ రూట్లో ఆ డ్రైవర్ వేగంగా దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే.. ఓ బైకర్ ఆ బస్సును అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా నడిచింది. కాసేపు ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. చేసేది లేక బస్సు డ్రైవర్ వెనక్కి తగ్గినట్లే కనిపించాడు. అయితే ఆ సమయంలోనూ నిర్లక్ష్యంగా ఓ ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టాడు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్అవుతోంది.
నగరంలోని 195W రూట్‌కు సంబంధించిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. రాంగ్ రూట్లో అత్యంత వేగంగా దూసుకెళ్లింది. ఈ సమయంలో ఓ బైకర్ ధైర్యంగా బస్సును అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బైకర్, అక్కడే ఉన్న ట్రాఫిక్ వాలంటీర్ గట్టిగా నిలదీయగా, డ్రైవర్ తీవ్ర ఆగ్రహంతో వాళ్లపై అసభ్య పదజాలంతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో బైకర్‌ను తప్పించి ముందుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆ బైకర్ మాత్రం అస్సలు తగ్గలేదు. రైట్ రూట్లోనే వెళ్లాలంటూ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆ బైకర్‌ను, ముందు ఉన్న ఓ కారును, ఆ రూట్లో వచ్చిపోయే వాహనాలను బస్సు డ్రైవర్ తన డ్రైవింగ్ స్కిల్స్‌తో భయపెట్టే ప్రయత్నం చేశాఉడ. ఆ తర్వాత బస్సు ముందుకు కదులుతూ ప్రయాణికులతో ఉన్న ఒక ఆటోను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో రోడ్డుపై కొంతసేపు గందరగోళం నెలకొంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ డ్రైవర్ల ప్రవర్తనపై మళ్లీ చర్చ మొదలైంది. కొందరు డ్రైవర్లు నిబంధనలు పట్టించుకోకుండా రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు ఆ బస్సు నెంబర్ TG 10 T 1469 మీద చలాన్లు ఉన్నాయంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు.
ఆ వీడియో విపరీతంగా వైరల్ కావడం, ట్యాగులు చేయడంతో ఈ ఘటనపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, టీజీఎస్ఆర్టీసీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. తక్షణ విచారణ చేపట్టామని చెబుతూ రీ ట్వీట్లు చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. నగరంలో ఇలా ప్రవర్తించే ఆర్టీసీ డ్రైవర్లు చాలామంది ఉన్నారని.. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వైఖరిని ప్రదర్శించరని కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆ బైకర్‌ను వెల్డన్ బ్రో అని అభినందిస్తున్నారు.
సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు)
'కాక్టెయిల్ 2' మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్నా సందడి (ఫొటోలు)
ఫిఫా ప్రపంచకప్ 2026 : అందరి కళ్లు వీరిపైనే..(ఫొటోలు)
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
FLO StyleTatva 6వ ఎడిషన్‌ను ప్రారంభించిన విజయలక్ష్మి , సుధా రెడ్డి (ఫొటోలు)
కరుప్పు బ్లాక్ బస్టర్.. సూర్య పై కన్నేసిన రావిపూడి
YS జగన్ దెబ్బ.. కూటమి తిరుపతి సభలో వెనక్కి తగ్గిన ముగ్గురు మొనగాళ్లు
విజయవాడలో బ్రదర్స్ వార్..! కేశినేని నానిపై కేసు నమోదు..
జ్ఞానేశ్వరి కేసులో సంచలన నిజాలు.. కుక్క చూపులో ఎదో తెలియని భయం
వాడొక కామాంధుడు.. మహిళా పైలట్ ని తనతో గడపమని..