
హైదరాబాద్లో చెరువుల సంరక్షణ మరియు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న హైడ్రా అధికారులకు తాజాగా తెలంగాణ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెంగళరావునగర్లోని సర్వే నంబర్ 45లో ఉన్న
హైదరాబాద్‌లో చెరువుల సంరక్షణ మరియు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న హైడ్రా అధికారులకు తాజాగా తెలంగాణ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెంగళరావునగర్‌లోని సర్వే నంబర్ 45లో ఉన్న రెండెకరాల వివాదాస్పద భూమి వ్యవహారంలో కోర్టు ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోవడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా విధించింది హైకోర్టు.హైడ్రా అధికారుల నిర్లక్ష్యంపై కోర్టు సీరియస్ ఈ మొత్తాన్ని ప్రధాన న్యాయమూర్తి సహాయ నిధికి చెల్లించిన తర్వాత మాత్రమే కౌంటర్ అఫిడవిట్లను స్వీకరించాలని రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. కోర్టు ఇచ్చిన గడువులను హైడ్రా అధికారులు నిర్లక్ష్యం చేయడం, సకాలంలో సరైన కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన హైడ్రాఈ కేసులో బాధితుడు మహమ్మద్ షఫీహతుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. గతంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, మార్చి 18న హైడ్రా బృందాలు స్థలంలోకి వెళ్లి కాంపౌండ్ వాల్ కూల్చివేసి, హైడ్రా పరిధి అని బోర్డులు పెట్టటం వంటి చర్యలు చేపట్టాయని బాధితుడు ఆరోపించారు. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని హైడ్రాను కోర్టు మలుమార్లు ఆదేశించినా సకాలంలో స్పందన రాలేదు.రిజిస్ట్రీలో లోపభూయిష్టంగా కౌంటర్లు, దీంతో కఠిన నిర్ణయం ఏప్రిల్ 8న చివరి అవకాశం ఇచ్చినప్పుడు కూడా కమిషనర్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటీవలి విచారణలో హైడ్రా తరపు న్యాయవాది ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశామని వాదించగా, రిజిస్ట్రీలో పరిశీలించగా అవి లోపభూయిష్టంగా ఉన్నాయని, సాంకేతిక కారణాలతో తిరస్కరించబడ్డాయని తేలింది. దీంతో న్యాయమూర్తి కఠిన నిర్ణయం తీసుకున్నారు.రాహుల్ గాంధీని కలిశాక మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!జూన్ 15న తుది విచారణహైడ్రా సంస్థ చెరువుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ సంఘటన న్యాయవ్యవస్థ ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఈ వివాదం హైదరాబాద్ అభివృద్ధి, చట్టపరమైన ప్రక్రియల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేస్తోంది. జూన్ 15న తుది విచారణ జరగనుంది. ఇప్పటికే జరిమానా చెల్లించి సరైన కౌంటర్లు దాఖలు చేస్తే మాత్రమే కేసు ముందుకు వెళ్ళే అవ అవకాశం ఉంది.