దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఈవీ కార్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగి, డెలివరీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీల పాపులర్ మోడళ్ల కోసం ప్రస్తుతం మూడు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత నాలుగేళ్లలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.
ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటింది. ఈ పరిణామం ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు కీలక మలుపుగా మారింది. ఇప్పటివరకు అధిక ధరలు, ఛార్జింగ్ సదుపాయాల కొరత వంటి కారణాలతో ఈవీల కొనుగోలుకు వెనుకాడిన వినియోగదారులు, ఇప్పుడు వాటిపైనే ఆసక్తి కనబరుస్తున్నారు.మార్చి నెల నుంచి తమ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (బీఈవీ) డిమాండ్ 40 శాతం మేర పెరిగిందని మెర్సిడెస్-బెంజ్ ఇండియా వెల్లడించింది.
ఏప్రిల్‌లో విడుదలైన సీఎల్ఏ బీఈవీ మోడల్‌కు రెండు నుంచి మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ సమయం ఉందని, దీనివల్ల డీలర్లు కొత్త బుకింగ్స్‌ను నిలిపివేశారని కంపెనీ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. బీఎండబ్ల్యూ ఇండియా సైతం ఇదే తరహా పరిస్థితులను ఎదుర్కొంటోంది.
మే నెలలో ఆ కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 33 శాతానికి చేరుకోవడం విశేషం.దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన కొత్త ఈ-విటారా ఎస్యూవీ