
అమరావతి: డీఎస్సీపై వైకాపా నేతలు చేసేవన్నీ దుష్ప్రచారాలేనని ఏపీ బయో డైవర్సిటీ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. తేదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు
. యువత భవిష్యత్తును గందరగోళపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. వైకాపా నాయకులు అవగాహన లేకుండా చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. ‘‘ ఆ పార్టీ ఐదేళ్ల పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కనీసం నోటిఫికేషన్లకే దిక్కులేదు. ఉద్యోగ ఖాళీల భర్తీనే పట్టించుకోనివాళ్లు ఇప్పుడు మాట్లాడుతుంటే ఏమనాలి’’ అని విజయ్‌కుమార్ ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుపతి జిల్లా తడ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు దగ్ధమైంది.