
ఇంటర్నెట్ డెస్క్: భారత విదేశాంగ శాఖ మరోసారి దిల్లీలోని అమెరికా దౌత్యవేత్త (USA diplomat) జేసన్ మీక్స్‌కు సమన్లు జారీ చేసింది. ఒమన్ తీరంలో భారతీయులతో వెళ్తున్న నౌకలపై గత నాలుగు రోజుల వ్యవధిలోనే
అమెరికా మూడు సార్లు దాడులు చేసింది. గురువారం కూడా ఓ నౌకపై దాడి జరగ్గా 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడుల్ని ఖండించిన భారత్ తాజాగా అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది (India summons). అంతకుముందు ఓ నౌకపై దాడి ఘటనలో.. ముగ్గురు భారతీయులు గల్లంతైన సమయంలోనూ భారత్ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
పశ్చిమాసియా సముద్ర జలాల్లో వాణిజ్య నౌకాయానానికి పెరుగుతున్న ముప్పుపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, అమెరికా నౌకాదళం దాడి చేయడంతో ఒమన్ తీరంలో బుధవారం గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందడంతో అక్కడ ఉన్న భారతీయులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS) కీలక సూచనలు చేసింది. హర్మూజ్, ఒమన్ తీరాల్లో పని చేస్తున్న దాదాపు 18వేల మంది నావికులకు సముద్ర భద్రతా సంబంధిత అడ్వైజరీని జారీ చేసింది. ఇదీ చదవండి: ముగ్గురు భారతీయుల్ని బలిగొన్న అమెరికా
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.