మీనాక్షి తరుపున కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటారు నిర్మల, సుబ్బారావులు. ఇక ఈరోజు (జూన్ 12) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. కోర్టు దగ్గర నిర్మల, సుబ్బారావుల కోసం ఎదురుచూస్తున్న
కమల్.. త్వరగా రమ్మని వాళ్లకి ఫోన్ చేస్తాడు. వచ్చేస్తున్నాం అని చెప్పడంతో అంతా కోర్టులోపలికి వెళ్తారు. ఇక జడ్జీ రావడంతో వాదనలు మొదలౌతాయి. మీనాక్షిని కోర్టులో ప్రవేశపెడతారు. ప్రతిగా పల్లవిని కూడా పిలుస్తారు. పల్లవి తరుపున వాదనలు వినిపించిన లాయర్.. రాజేశ్వరిని మీనాక్షి చంపేసిందని.. ఆ నేరం తనంతట తానే ఒప్పుకుంది అని అంటారు. ఇంతలో శ్రీకర్.. అబ్జెక్షన్ చెప్పి తన వాదనలు వినిపిస్తాడు. నిందితురాలే నేరం చేశానని ఒప్పుకుంటే.. వాదనలు అనవసరం అని అంటాడు పల్లవి తరపు లాయర్. మీనాక్షి గారి ఆరోగ్య పరిస్థితి సరిగా లేని కారణంగా.. చేయని నేరాన్ని చేశానని ఒప్పుకుందని వాదనలు వినిపిస్తాడు శ్రీకర్. రాజేశ్వరి చావుకి మీనాక్షికి అసలు సంబంధమే లేదని.. రాజేశ్వరి ఎలా చనిపోయారో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యులు ఉన్నారని అంటాడు శ్రీకర్.టైం ఇవ్వమని శ్రీకర్ రిక్వెస్ట్.. ఆ మాటతో షాక్ అవుతుంది పల్లవి. రాజేశ్వరి గారిది హత్య కాదు.. ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయారని చెప్పడానికి సాక్ష్యులు సిద్ధంగా ఉన్నారు అని అంటాడు శ్రీకర్. సాక్ష్యుల్ని ప్రవేశపెట్టమని చెప్తారు జడ్జీ. సుబ్బారావు, నిర్మల పేర్లను ఎన్నిసార్లు పిలిచినా కూడా వాళ్లు కనిపించరు వినిపించరు. కమల్ కాల్ చేస్తే.. స్విచ్ఛాఫ్ వస్తుంది. శ్రీకర్ తెల్లమొహం వేస్తాడు. ఇక అవని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. సాక్ష్యులు ఎక్కడా అని జడ్జీ అడిగితే.. వచ్చేస్తున్నారు.. మాకు కాస్త టైమ్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు శ్రీకర్. దానికి సరేనంటారు జడ్జీ. కానీ.. పల్లవి తరుపు లాయర్ మాత్రం.. సాక్ష్యాలు లేవు.. ఏమీ లేవు ఇదంతా డ్రామా అని అంటాడు. మీనాక్షికి జైలు శిక్ష.. రిమాండ్ ఖైదీగానే ఇక జడ్జీ కాస్త సమయం ఇఛ్చి.. సాక్ష్యులు రాకపోవడం వలన ఈ కేసును నాలుగు రోజులు వాయిదా వేస్తున్నా అని అంటారు. ముద్దాయి తనకి తానుగా నేరాన్ని అంగీకరించింది కాబట్టి.. ఆమెని నిందితురాలుగా పరిగణిస్తూ.. ఆమెను రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉంచాలని పోలీసులకు ఆదేశిస్తారు. సాక్ష్యులు ఉన్నారని చెప్తున్నారు కాబట్టి.. వాళ్లు చివరి వాయిదాకి తప్పకుండా రావాల్సిందే అని అంటారు జడ్జీ. దాంతో మీనాక్షిని జైలుకి తరలిస్తారు. ఇక కోర్టు బయట మీనాక్షిని పట్టుకుని తెగ ఏడ్చేస్తుంటుంది అవని. అంతా మన తలరాతమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనాక్షి. సాక్ష్యులు ఎలా మిస్ అయ్యారనుకుంటున్నావా?? ఇచ్చిపడేసిన పల్లవి ఇక శ్రీకర్.. అవనికి ధైర్యం చెప్తాడు. సాక్ష్యులు వస్తే అత్తయ్యకి శిక్ష తప్పినట్టే అని అంటాడు. అసలు వాళ్లు ఎందుకు రాలేదో కనుక్కోమని చెప్తాడు చక్రధర్. సరేనని అక్షయ్, కమల్‌లు వెళ్తారు. సాక్ష్యులు వస్తారు.. అమ్మ రిలీజ్ అవుతుందని అనుకున్నా.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అవని. ఇంతలో అవని వచ్చి వాయింపు స్టార్ట్ చేస్తుంది. సాక్ష్యులు ఎలా మిస్ అయ్యారని అనుకుంటున్నావా? నువ్వు ఏదొక ప్రయత్నం చేస్తావని తెలుసు.. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. మీరు సుబ్బారావుని అతని భార్యని కలిశారని నాకు ముందే తెలుసు.నీ తల్లికి శిక్ష పడాల్సిందే.. ‘నీ తల్లే నాతల్లే పిచ్చి చెల్లే’ వాళ్లని కోర్టుకి తీసుకుని వస్తున్నారనీ తెలుసు.. అందుకే నేనే వాళ్లని కోర్టుకి రాకుండా చేశాను అని అంటుంది పల్లవి. ఛీ ఛీ నీకు మానవత్వమే లేదా? అని అంటాడు చక్రధర్. ఇక ఆపుతారా.. మీరు కూడా నీతులు చెప్తున్నారు.. మీకు మా మామ్ చనిపోయిందనే బాధ లేదు కానీ.. మీనాక్షి రిలీజ్ కాలేదని బాధ మాత్రం ఎక్కువగా ఉంది. తెగ బాధపడిపోతున్నావ్.. అసలు నీకు మాట్లాడే అర్హత లేదు అని ఇచ్చిపడేస్తుంది పల్లవి. చూడు అవనీ.. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా.. అడ్డుకుంటూనే ఉంటాను. నీ తల్లికి శిక్ష పడేట్టు చేస్తాను. నీ తల్లి జీవితం జైల్లోనే అంతం అవ్వాల్సిందే. జరిగేది ఇదే’ అని అంటుంది పల్లవి. నువ్వు ఇలా చెప్పవ్లే కానీ.. ఇట్టా చూడు ఇక భరత్‌ని తీసుకుని వెళ్లిపోతుంది పల్లవి. అటు కమల్, అక్షయ్‌లు సుబ్బారావు ఇంటికి వెళ్లి వెతుకుతారు. అయితే వాళ్లని ఎదురుగా ఉన్న సర్రూ అలియాస్ సరోజ గమనిస్తూ ఉంటుంది. కమల్ చూపు అతనిపై పడి.. నేరుగా ఆమె ఇంటికి వెళ్తాడు. నీ యవ్వారం అంతా నాకు తెలుసు కానీ.. వాడు ఎక్కడికి వెళ్లాడూ.. చెప్పకపోతే వీడియో బయటకు వచ్చేస్తుంది అంటూ వీడియో చూపిస్తాడు కమల్. దాంతో సరోజ.. ‘ఎక్కడికి వెళ్లాడో తెలియదు కానీ.. అడిగితే కోర్టుకి అని చెప్పాడు. అతనికి కోర్టులు కేసులు అంటే భయం’ అని అంటుంది సరోజ. మా అమ్మకి శిక్ష పడేలా ఉంది.. కేసు వాపస్ తీసుకో సిస్టర్ దాంతో కమల్.. వాడు నిజంగానే భయపడి పారిపోయాడా అనుకుంటూ.. వాడ్ని ఎలాగైనా వెతికి తీసుకొస్తానంటూ అక్షయ్‌తో చెప్తాడు. అటు భరత్.. పల్లవి దగ్గరకు వెళ్లి.. మా అమ్మని విడిపిస్తానని మాట ఇచ్చావ్ కదా.. అమ్మని మీరే విడుదల చేయించాలి. అమ్మకి శిక్ష పడుతుందేమోనని భయంగా ఉంది.. నువ్వు కేసు వాపస్ తీసుకుంటే మా అమ్మకి శిక్ష తప్పుతుంది.. వాపస్ తీసుకో సిస్టర్ అని ప్రాధేయపడతాడు. మీ అక్కని జైల్లో పెట్టాలని నేను అనుకుంటే మీ అమ్మ నేరం తనపై వేసుకుంది.. నువ్వేంట్రా ఆ సంతృప్తి కూడా లేకుండా చేస్తున్నావ్? మీ అమ్మని విడిపించమంటున్నావ్ ఏంట్రా అని తనలో తాను అనుకుంటుంది పల్లవి.జైలర్‌కి ఫోన్.. భరత్‌ని పూర్తిగా నమ్మించిన పల్లవి ఏంటి సిస్టర్.. నాకోసం ఏమైనా చేస్తా అని అన్నావ్ కదా.. కేసు వాపస్ తీసుకో సిస్టర్ అని అంటాడు భరత్. దాంతో పల్లవి.. ‘నాకు మీ అమ్మపై ఏం కోపం లేదు భరత్.. కానీ నువ్వు మీ అమ్మకోసం ఎంత ఆరాటపడుతున్నావ్.. కానీ మీ అక్క మాత్రం ఏ పట్టనట్టే ఉంది. ఏదొక ప్రయత్నం చేసేది కదా.. సాక్ష్యులు ఉన్నారని చెప్పింది తప్పితే వాళ్లని రప్పించలేకపోయింది. అలాంటి దాని కోసం మీ అమ్మ నేరం తనపై వేసుకుంది.. కాబట్టి మీ అమ్మ నేరం చేయలేదంటే కోర్టులో నమ్మరు. నీకు ఇప్పటికైనా మీ అక్క ఎలాంటిదనేది అర్థం అయ్యిందా? మీ అక్క ఆలోచించకపోయినా.. నేను మీ అమ్మ గురించి ఎంత ఆలోచిస్తున్నానో చూడు అంటూ జైలర్‌కి ఫోన్ చేస్తుంది. మీరు చెప్పినట్టే మీనాక్షి గారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం’ అని చెప్తాడు జైలర్. దాంతో పూర్తిగా నమ్మేస్తాడు భరత్. ఇక రేపటి ఎపిసోడ్లో అక్షయ్ వెళ్లి పల్లవిని నిలదీస్తాడు.