
రాయలసీమను 'రాయల్ సీమ'గా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం రూ.లక్ష కోట్ల భారీ బడ్జెట్‌తో 'మిషన్ రాయలసీమ' ప్రాజెక్టును చేపట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు
. ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్‌కు సీసీడీ జబ్బుంది.. జీ అంటే గొడ్డలిప్రతిపక్ష నేత జగన్‌కు 'సీసీడీ' (క్రెడిట్ చోరీ డిజార్డర్) అనే జబ్బు ఉందని లోకేశ్ ఎద్దేవా చేశారు. తాము కష్టపడి గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తే, వాటిని తానే తెచ్చానని ప్రెస్‌మీట్ పెట్టి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. "ఇంకొంత కాలం సమయం ఇస్తే, ఆగస్టు 15న ప్రెస్‌మీట్ పెట్టి భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది మా తాతేనని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ తెచ్చిన కంపెనీలు కేవలం ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ వంటి మద్యం బ్రాండ్లు మాత్రమేనని ఆరోపించారు. "జగన్ పేరులో ఉన్న 'జీ' అంటే జెన్-జీ అనుకుంటున్నారు. కానీ, ఆ జీకి అసలు అర్థం 'గొడ్డలి'. విధ్వంసమే ఆయన ఎజెండా" అని లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. తమది గూగుల్ అయితే వాళ్లది గొడ్డలని, తమది ఫైటర్ జెట్స్