
Lifelong 10000mAh MagSafe Power Bank: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో Lifelong 10000mAh MagSafe Wireless పవర్ బ్యాంక్ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి
సగం కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Lifelong 10000mAh MagSafe Power Bank Offers: ఐఫోన్, యాపిల్ ఎయిర్‌పాడ్స్‌తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అన్ని ఫోన్ల కోసం డిజైన్ చేసిన Lifelong 10000mAh MagSafe Wireless పవర్ బ్యాంక్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ఎంతో ఇష్టంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే పొందవచ్చు..
Lifelong 10000mAh MagSafe Wireless పవర్ బ్యాంక్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఐఫోన్ 12, 13, 14తో పాటు ఆ తర్వాతి సిరీస్ ఫోన్లకు ఇది మ్యాగ్నెటిక్ అలైన్మెంట్తో సులభంగా అతుక్కుని (Snap-on) ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా మిగిలిన Qi-సపోర్టెడ్ ఆండ్రాయిడ్ ఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌ను కూడా వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసే సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.
ఇందులో మెటల్ స్టాండ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఈ పవర్‌బ్యాంక్‌కు వెనుక వైపు ఫోల్డబుల్ మెటల్ స్టాండ్ ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు టేబుల్‌పై నిలువుగా లేదా అడ్డంగా పెట్టుకుని వీడియోలు చూసేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని కంపెనీ క్లైమ్ చేస్తూ వస్తోంది.. ఇవే కాకుండా ఇందులో ఇతర ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇందులో కంపెనీ ఇన్-బిల్ట్ ఛార్జింగ్ కేబుల్స్ (Type-C, Lightning) కూడా అందిస్తోంది. దీనివల్ల విడిగా కేబుల్స్ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.. అలాగే పవర్‌బ్యాంక్‌లో ఎంత శాతం ఛార్జింగ్ ఉందో తెలుసుకోవడానికి చాలా ప్రత్యేకమైన LED డిజిటల్ డిస్ప్లే కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా చాలా స్లిమ్‌గా, తేలికగా ఉండడం వల్ల చాలా సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు.
ఇది 22.5W వరకు వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. గరిష్టంగా 15W వరకు వైర్లెస్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అంతేకాకుండా 12-లేయర్ అడ్వాన్స్డ్ చిప్సెట్ ప్రొటెక్షన్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. దీనికి కంపెనీ 4 నుండి 5 అవుట్‌పుట్ ఆప్షన్స్‌ను కూడా అందిస్తూ వస్తోంది.
మార్కెట్లో దీని అసలు ధర MRP రూ.3,999 కాగా.. దీనిని ఇప్పుడే అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి 55 శాతం వరకు ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.1,589కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి పేమెంట్ చేసేవారికి మరింత తగ్గింపు లభిస్తుంది.