భారతీయ క్రీడా అభిమానులకు షాకింగ్ న్యూస్. ప్రముఖ షూటర్, పిస్టల్ కోచ్ జస్పాల్ రాణా తన 49వ ఏట కన్నుమూశారు. గుండెకి సంబంధించిన ప్రాబమ్స్తో ఆయన మరణించినట్టు తెలుస్తుంది. జస్పాల్ రాణా మరణం పట్ల
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె సంబంధిత వ్యాధులే (CVDలు) ప్రధాన కారణం. ఇటీవలి గణాంకాల ప్రకారం, గుండె జబ్బులతో సంభవించే అకాల మరణాలలో 80% ఇప్పుడు మధ్య, తక్కువ ఆదాయ దేశాలలోనే సంభవిస్తున్నాయి. ఈ జాబితాలో భారతదేశం వంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి.సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, నిశ్చల జీవనశైలి వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. గుండె జబ్బు అనేది గుండెను ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ఈ పరిస్థితులు గుండెలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయవచ్చు. గుండెపోటు , గుండె ఆగిపోవడం, అరిథ్మియా వంటి పరిస్థితులు సర్వసాధారణం. గుండె జబ్బు లక్షణాలను గుర్తించడం ద్వారా, వీలైనంత త్వరగా దానిని గుర్తించి చికిత్స చేయడానికి సాయపడుతుంది.జస్పాల్ రాణా కన్నుమూతనేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కలికేష్ నారాయణ సింగ్ దేవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జస్పాల్ రాణా శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో శ్వాస విడిచారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) ప్రపంచ కప్ ముగించుకుని భారత బృందంతో కలిసి తిరిగి వస్తున్న సమయంలో ఆయన గుండెకి సంబంధించిన అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ఛాతీనొప్పిని, అసౌకర్యాన్ని గ్రాస్ సమస్యగా భావించారు. ఆ తర్వాత ఈ లక్షణాలు ఎక్కువయ్యాయి.న్యూఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే ఆయనను సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు 'స్టెంట్' (stent) వేసే ప్రక్రియను చేపట్టారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు మ్యాక్స్ ఆసుపత్రి యాజమాన్యం ధృవీకరించింది.తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీగుండె జబ్బు లక్షణాలు ఏంటి?నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం, ప్రతి గుండె సమస్యకు దాని సొంత లక్షణాలు ఉంటాయి. కానీ కొన్ని సాధారణ లక్షణాల సాయంతో గుండెలో సమస్య ఉందని నిర్ధారించవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గుండె దడ (వేగవంతమైన గుండె కొట్టుకోవడం) తలతిరగడం చెమట పట్టడం మెడ నొప్పి అలసట వికారం లేదా వాంతులు శరీర దిగువ భాగంలో (ముఖ్యంగా కాళ్ళలో) వాపు గుండెల్లో మంట ఛాతీలో ఒత్తిడి లేదా నొప్పి వ్యాయామం చేయడంలో లేదా అధిక శారీరక శ్రమ చేయడంలో ఇబ్బంది రాత్రిపూట నిద్రపట్టడంలో ఇబ్బంది జ్వరం45 ఏళ్ల పురుషులకు ముప్పు45 ఏళ్లలోపు పురుషుల్లో లక్షణాలు కనిపించని గుండె జబ్బుల ప్రమాదాలు వేగంగా పెరుగుతున్నాయి. ఇవి తరచుగా స్పష్టమైన లక్షణాలను చూపించవు. 45 ఏళ్లలోపు పురుషులలో ప్రారంభ దశలోనే అథెరోస్క్లెరోసిస్ (ధమనులలో కొవ్వు పేరుకుపోవడం), సాధారణ స్థాయికి మించిన అధిక రక్తపోటు, ఇన్సులిన్ నిరోధకత, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ వ్యాధులు ఎటువంటి లక్షణాలు లేకుండానే తీవ్రమవుతున్నాయి.సైలెంట్‌గా దాడిచేసే గుండె జబ్బులకు కారణాలు చెడు జీవనశైలి గుండెకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. పెరుగుతున్న ఒత్తిడి నిద్రలేమి, ధూమపానం అలవాటు జన్యుపరమైన కారకాలు మధుమేహం, అధిక రక్తపోటు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు పర్యావరణ కాలుష్యం ఎక్కువ సేపు స్క్రీన్ల ముందు కూర్చోవడం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారికి ముప్పు ఎక్కువ ఇవి నిశ్శబ్దంగా రక్తనాళాలను దెబ్బతీసి గుండె జబ్బులకు దారితీసే సైలెంట్ కారణాలు. ఈ సమస్యను ముందుగానే పరిష్కరించకపోతే, గుండెపోటు లేదా తీవ్రమైన గుండె సమస్యల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.ఈ పరీక్షలు ప్రాణాంతక పరిస్థితులను నివారించగలవుగుండె జబ్బుల్ని నివారించడానికి, యువత రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్, రక్తంలో చక్కెర, బాడీ మాస్ ఇండెక్స్ (BMI) వంటి ప్రాథమిక కానీ కీలకమైన పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) గుండె లయలోని అసాధారణతలను గుర్తించగలదు. అవసరమైతే ఎకోకార్డియోగ్రఫీని కూడా వైద్య నిపుణులు సిఫార్స్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ టెస్టులు, కరోనరీ కాల్షియం స్కోరింగ్ లేదా అధునాతన బ్లడ్ మార్కర్లను కూడా సిఫార్సు చేస్తారు. గుండె జబ్బుల్ని ముందుగా గుర్తించడం వల్ల సకాలంలో జీవనశైలి మార్పులు చేసుకోవచ్చు. అవసరమైతే మందులు వాడటం ప్రారంభించవచ్చు.