
తిరుపతి: ప్రజలు కేవలం ఓటే కాదు.. చరిత్ర రాస్తారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)అన్నారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మళ్లీ కొత్త ఆశలు వచ్చాయని, ఆ తీర్పు ఒక తరం
భవిష్యత్తుకు నమ్మకం కలిగించిందన్నారు. ప్రజలు మౌనంగా కనిపించినా.. చరిత్రను మార్చగలరని నిరూపించారన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘రెండేళ్ల క్రితం కేవలం అధికారం కాదు.. బాధ్యత ఇచ్చారు. చారిత్రక విజయానికి కారణమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. అహంకారం, విధ్వంసంపై.. ప్రజాస్వామ్యం సాధించిన విజయం ఇది. ఏపీ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి ఇది. అధికారం పంచుకోవడానికి కాదు.. బాధ్యత పంచుకునేందుకు కూటమి ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతో సరిపెట్టుకున్న సందర్భంలో చాలామంది విమర్శించారు. కానీ, ప్రజల ఆశీర్వాదంతో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన మోదీకి అభినందనలు. ఎన్డీయే సమష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగాం. దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దుర్ఘటన జరిగినందున ఈనెల 9న జరగాల్సిన కార్యక్రమం ఇవాళ జరుపుకొంటున్నాం. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే’’ అని డిప్యూటీ సీఎం అన్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
వేసవి సెలవుల అనంతరం.. ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు. వారికి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. దీంతో ఆయా పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆ ఫొటోలు..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపార రంగంలో రాణించాలంటే కేవలం వ్యాపార సూత్రాలు తెలిస్తే సరిపోదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.