
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని, రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలను కోరామని తెలిపారు
2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని తెలిపారు.
తిరుపతి, జూన్ 12: 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని తెలిపారు. 2024లో 57 శాతం ఓట్ షేర్.. 94 శాతం స్ట్రయిక్ రేట్ సాధించామని చెప్పుకొచ్చారు. 2024లో రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని అన్నారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైందన్నారు. రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ అని చంద్రబాబు వెల్లడించారు.
శుక్రవారం నాడు తిరుపతి జిల్లా దామినేడులో ఎన్డీయే విజయోత్సవ సభ నిర్వహించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ అరాచక పాలన మొదలైందన్నారు. కేంద్ర పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేశారని మండిపడ్డారు.
అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్ చేసిందేమీలేదని సీఎం విమర్శించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. కేసులు, జైళ్లతో చీకటి పాలన సాగించారని దుయ్యబట్టారు. అలాంటి దశలో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఏపీలో చీకటి పాలన పోయి.. ప్రజాపాలన వచ్చిందన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి కేంద్రం బతికించిందని చెప్పుకొచ్చారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్ అంశాల్లో కేంద్ర సహకారం దక్కిందన్నారు. అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆందోళనకు జేసీ ప్రభాకర్ సిద్ధం.. అడ్డుకున్న పోలీసులు
రాయలసీమలో రత్నాలు పండేలా చేసిన వ్యక్తి సీబీఎన్: మంత్రి లోకేశ్