
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జూన్ 13న ధర్మశాలలో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 6 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా 16 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జూన్ 13న ధర్మశాలలో తొలి వన్డే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 6 పరుగులు చేస్తే ఓపెనర్‌గా 16 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు
శనివారం నుంచి అఫ్గాన్‌తో వన్డే సిరీస్ తొలి వన్డేకు ముందు రోహిత్ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 6 పరుగులు చేస్తే.. Rohit Sharma : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య శనివారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిట్నెస్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలి వన్డేకు అందుబాటులోకి వచ్చాడు. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 6 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా 16 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. అదే 126 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమిస్తాడు. ఓపెనర్‌గా సెహ్వాగ్ 16119 పరుగులు చేయగా హిట్‌మ్యాన్ 15994 పరుగులు సాధించాడు. *PV Sindhu : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే.. * సనత్ జయసూర్య (శ్రీలంక) - 19298 పరుగులు * క్రిస్ గేల్ (వెస్ట్ ఇండీస్) - 18867 పరుగులు * డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - 18744 పరుగులు * గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) - 16950 పరుగులు * డెస్మండ్ హేన్స్ (వెస్ట్ ఇండీస్) - 16120 పరుగులు * వీరేంద్ర సెహ్వాగ్ (భారతదేశం) - 16119 పరుగులు * రోహిత్ శర్మ (భారతదేశం) - 15994 పరుగులు కాగా.. సెహ్వాగ్ రికార్డును అధిగమించేందుకు రోహిత్ శర్మకు అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌లు అవకాశం ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో 126 పరుగులు చేస్తే సెహ్వాగ్‌ను అధిగమిస్తాడు. *FIFA World Cup 2026 : ఏమయ్యా మ్యాచ్ రిఫరీ ఎల్లో కార్డు మరిచిపోయావా ఏంది? మూడు రెడ్ కార్డులే.. మీమ్స్ వైరల్ భారత్, అఫ్గాన్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే.. * తొలి వన్డే - జూన్ 13న (ధర్మశాల) * రెండో వన్డే - జూన్ 17న (లక్నో) * మూడో వన్డే - జూన్ 20న (చెన్నై)