
Visha Yogam Effect On Zodiac: ఎంతో శక్తివంతమైన విష యోగంతో కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సి
ఉంటుంది.
Visha Yogam Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో.. ఎన్నో యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యోగాలు అన్ని రాశులను ప్రభావితం చేస్తాయి. ఇదిలా ఉంటే జూన్ 10న ఎంతో ప్రమాదకరమైన విష యోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుంది. అయితే, ఈ యోగం వల్ల కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే జీవితంలో అనుకోని మార్పులు వస్తూ ఉంటాయి.
శని, చంద్రులు కలయిక కారణంగా ఈ ప్రమాదకరమైన విషయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా రాబోయే వారం రోజుల పాటు కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరికి సామర్థ్యం కూడా తగ్గి.. ఎలాంటి పనులు చేయలేకుండా ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ విష యోగం ప్రభావంతో మేష రాశివారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతుంది. మానసిక ఆందోళన వంటి సమస్యలు కూడా వస్తాయి. వీరికి ఈ సమయంలో తప్పకుండా అకస్మాత్తుగా పెద్ద ఖర్చులు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి నిద్రలేమి సమస్యలు కూడా రావచ్చు. దీర్ఘకాలిక సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
కన్యారాశి వారికి ఏడవ స్థానంలో ఈ ప్రమాదకరమైన యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా జీవిత భాగస్వామితో లేదా వ్యాపారాల భాగస్వాములతో తప్పకుండా అపార్థాలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి పని ప్రదేశాల్లో గొడవలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే ఎలాంటి సమస్యలు ఉన్న తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి..
విష యోగంతో కుంభ రాశివారు తప్పకుండా మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో సంపాదించిన డబ్బులు కూడా భారీగా తగ్గిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు మాట్లాడే క్రమంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో ఆలోచించి.. నిర్ణయాలు తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.
మీన రాశివారికి ఈ సమయంలో ఆందోళనతో పాటు అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతికూల ఆలోచనతో బాధపడేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వీరు తప్పకుండా ప్రియమైనవారితో విభేదాలు తలెత్తవచ్చు.