
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
How to prepare for the IAS exam using NCERT, and which books are required for UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష అని చెప్పాలి. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రతి ఏడాది లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతుంటారు. ప్రతి ఏడాది ఈ పరీక్షను సుమారు 1,000 పోస్టుల కోసం నిర్వహిస్తుంటుంది యూపీఎస్సీ. వాటిలో కేవలం 100 మాత్రమే ఐఏఎస్ పోస్టులు ఉంటాయి. అందుకే ఈ పరీక్షకు అత్యంత పోటీ ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతేనే ఐఏఎస్ లుకా సెలక్ట్ అవుతారు. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడి చదవడమే కాదు.. సరైన దిశలో. సరైన అధ్యయన సామాగ్రిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్లో లభించే వేలాది పుస్తకాల్లో ఏ పుస్తకం చదవాలో తెలియక చాలా మందిని గందరగోళానికి గురిచేస్తుంది. యూపీఎస్సీ సిలబస్ ఎంత విస్త్రుతంగా ఉంటుందంటే.. ఏళ్ల తరబడి ప్రిపేర్ అయిన తర్వాత కూడా కొంతమంది వెనకబడిపోతున్నామని భావిస్తుంటారు. అందుకే యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఎన్ సీఈఆర్టీ పుస్తకాలతో బలమైన పునాది వేయవచ్చని అభ్యర్థులు నమ్ముతుంటారు. యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులు.. అనుభజ్నులైన ఉపాధ్యాయులు ఇద్దరూ ప్రాథమిక ప్రిపరేషన్ కోసం ఎన్ సీఆర్టీ పుస్తకాలను అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తుంటారు.
NCERT పుస్తకాలు ఎందుకంత ముఖ్యమైనవి? యూపీఎస్సీ పరీక్షకు చరిత్ర, భూగోళశాస్త్రం, రాజనీతి, అర్థశాస్త్రం, విజ్నానశాస్త్రం వంటి విషయాలపై బేసిక్ నాలెడ్జ్ చాలా కీలకమని చెప్పాలి. NCERT పుస్తకాలు ఈ అంశాలను చాలా సులభంగా అర్థమయ్యే భాషలో వివరిస్తూ.. భావనలను వివరిస్తుంటాయి. ఈ పుస్తకాలే ప్రిలిమ్స్, మెయిన్స్ లో అడిగే ప్రశ్నలకు పునాదిగా నిలుస్తాయి.
-6 నుండి 12వ తరగతి వరకు NCERT చరిత్ర -భారత చరిత్రలోని ఇతివృత్తాలు (12వ తరగతి)
-6 నుండి 12వ తరగతి వరకు NCERT భూగోళశాస్త్రం -భౌతిక భూగోళశాస్త్ర ప్రాథమికాంశాలు (11వ తరగతి) -భారతదేశం: భౌతిక పర్యావరణం (11వ తరగతి)
-9 నుండి 12వ తరగతి వరకు రాజనీతి శాస్త్రం NCERT
9 నుండి 12వ తరగతి వరకు NCERT అర్థశాస్త్రం
NCERT పుస్తకాలే కాకుండా ఇంకా ఏ పుస్తకాలు అవసరం అవుతాయి?
NCERT పుస్తకాలతో బేసిక్ ఇన్ఫర్మెషన్ నేర్చుకున్న తర్వాత అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలను చదవాలి. యూపీఎస్సీకి తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని పుస్తకాలు చూద్దాం.
ఆధునిక భారతదేశ సంక్షిప్త చరిత్ర – స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్
భౌతిక ,మానవ భూగోళశాస్త్రంలో సర్టిఫికేట్ – జి.సి. లియోంగ్ అట్లాస్ (ఓరియంట్ బ్లాక్స్వాన్ లేదా ఆక్స్ఫర్డ్)
యూపీఎస్సీలో విజయం సాధించాలంటే వ్యూహాన్ని ఇలా రూపొందించుకోండి: దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సక్సెస్ అవ్వాలంటే.. NCERT బలమైన పునాది. సరైన పుస్తకాల ఎంపిక, క్రమం తప్పని అధ్యయనం, నోట్స్ రాసుకోవడం, నిరంతరం పునశ్చరణ చేయడం మాత్రమే మార్గమని చెబుతున్నారు. అభ్యర్థులు మొదటి నుంచే ఒక క్రమబద్ధమైన వ్యూహాన్ని అనుసరిస్తే, IAS కావాలనే వారి కల నిజం అవుతుంది. పుస్తకాలను పోగుచేయడానికి బదులుగా, పరిమితమైన, విశ్వసనీయమైన వనరులపై దృష్టి పెట్టండి. ప్రతి సబ్జెక్టుకు ఒక ముఖ్యమైన పుస్తకాన్ని ఎంచుకుని, దానిని చాలాసార్లు పునశ్చరణ చేయండి. అలాగే, ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడం, సమకాలీన విషయాలపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకుంటే... UPSC ప్రిపరేషన్లో విజయం పక్కా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.