
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Sing Geetham Review Rating Public Talk: తెలుగులో పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, బృందావనం, మైఖేల్ మదన కామరాజు, మయూరి వంటి చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సింగ్ గీతం’. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా అనేది మన మూవీ రివ్యూలో చూద్దాం.
ప్రతాప్ (అయాన్) చేసిన అప్పులు తీర్చలేక జైలు పాలవుతాడు. ఆ తర్వాత భోపాల్ జైలు నుంచి విడుదలైన తర్వాత తన తండ్రికి సంబంధించిన 99 ఎకరాల ఆస్తి గురించి తెలుస్తుంది. దాన్ని చేజక్కించుకోవడానికి కుబేర పురం వెళతాడు. ఆ ఊరు మొత్తం గోల్డ్ మైనింగ్ కారణంగా బీడు పడిపోతుంది. అక్కడ ఓ పెద్ద చెట్టు తప్పించి మరో చెట్టు ఉండదు. ఆ ఊర్లో గౌరి (అహిల్య బామ్రూ) చెట్టు అంటిపెట్టుకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో మైనింగ్ కోసం చెట్టును తొలిగిస్తాడు. ఆ తర్వాత కుబేరుడి శాపం కారణంగా అందరికీ మాట పడిపోయి.. ఆ మాట సంగీతం రూపంలో వస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఊరి ప్రజల శాపానికి గల కారణాలు ఏమిటి..? చివరకు ఊరి ప్రజలు ఆ శాపం నుండి ఎలా బయటపడ్డాడనేదే ఈ మూవీ స్టోరీ.
దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు నుంచి చాలా యేళ్ల తర్వాత సినిమా వస్తుందంటే ఏదో ప్రత్యేకత ఉండాల్సిందే. ఆయన సినిమాలు చూస్తే ఒక దానితో మరొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించడమే కాదు. ఆ చిత్రాలతో ప్రేక్షకుల మదిని దోచాడు. తాజాగా ‘సింగ్ గీతం’ సినిమా కూడా ఆషామాషీ సబ్జెక్ట్ కాదు. ఇలాంటి ఓ సబ్జెక్ట్‌ను అనుకోవడం.. దాన్ని అంతే స్థాయిలో తెరకెక్కించడం అనేది మాటలు కాదు. ముఖ్యంగా ఊరి ప్రజలు కుబేరుడి శాపం కారణంగా మాట పోయి.. ఆ ప్లేస్‌లో సంగీతం తరహాలో మాటలు వస్తుంటాయి. దీని వెనక కారణం ప్రకృతి. ప్రస్తుతం ప్రజలు అభివృద్ది అంటూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. దీని వలన భావి తరాలకు మనం స్వచ్ఛమైన సమాజాన్ని ఇవ్వలేకపోతున్నాము.
అందరు మొక్కలు నాటాలి. నాటకపోతే.. దేశం ఎడారి అవుతుందనే సందేశం ఇచ్చాడు దర్శకుడు. మొత్తంగా ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుందనే ఉద్దేశ్యం ఈ సినిమాతో చెప్పారు. వృక్షో రక్షితి రక్షిత: అనే సూక్తిని ఈ సినిమాలో చూపించాడు. పూర్తిగా ఓ విలేజ్‌లో మైనింగ్ కోసం ఊరు ప్రజలు స్వార్థపరులుగా మారడం.. చివరకు వారిలో ఎలాంటి పరివర్తన వచ్చిందనే అంశానని చాలా హాస్యభరితంగా సున్నితంగా మలిచాడు. సినిమా అర గంట తర్వాత నుంచి సినిమా మొత్తం పాట రూపంలో ఉండటం మాస్ ప్రేక్షకులు ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. సినిమాతో సింగీతం ఇచ్చిన సందేశం అందరిని ఆలోచింపజేస్తుంది. ఇలాంటి సబ్జెక్ట్‌ను సింగీతం డైరెక్ట్ చేయడమే కాదు.. దాన్ని తెరకెక్కించడం అంతే సాహసంతో కూడుకున్నదనే చెప్పాలి. సింగీతం కూడా తన పాత క్లాసికల్ సినిమాలకు సంబంధించిన పాటలు ఈ సినిమాలో అక్కడక్కడ ఉండటం ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది. ఈ విషయంలో నాగ్ అశ్విన్ ను అభినందించాల్సిందే. దేవీశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగున్నాయి.
కొత్త నటీనటులైన అయాన్, అహిల్య, షాలినీ కొండేపూడి కొత్తవాళ్లైనా మంచి నటన కనబరిచారు. సినిమాల్లో ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు సహజంగా నటించారు. సీనియర్ నటుడు బెనర్జీ తన మార్క్ విలనిజం.. రాహుల్ రవీంద్రన్, తులసీ తమ పాత్రల్లో మెప్పించారు. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో గెస్ట్ అప్పీరియన్స్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. అది ఎవరో సినిమా చూస్తే కానీ మజా రాదు.
పంచ్ లైన్.. ప్రేక్షకులను సరికొత్త లోకానికీ తీసుకేళ్లే.. ‘సింగ్ గీతం’..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.