
Oman coast ship attack: అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఒక ఘోర ఉదంతం విశాఖపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒమన్ తీరంలో ఇటీవల ఒక భారతీయ నౌక పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ
అటాక్‌లో మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేశ్ పట్నాల ఉన్నట్లు సమాచారం అందింది. సముద్ర ప్రయాణంలో ఉన్న నౌకపై ఒక్కసారిగా జరిగిన ఈ బాంబు దాడితో ఒక్కసారిగా పరిస్థితి విషమంగా మారింది.
Read also: Kutami Govt : కూటమికి రెండేళ్లు.. నేడు తిరుపతి లో ‘సంక్షేమం’ పేరిట సభ
నౌకపై జరిగిన ఈ దాడిలో సురేశ్ పట్నాల మరణించిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా, అధికారిక మార్గాల ద్వారా తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. అటు న్యూఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు సైతం ఈ విషాద వార్తను అధికారికంగా ధ్రువీకరించారు. మృతుడి దేహాన్ని, ఇతర వివరాలను సేకరించేందుకు, అలాగే సురేశ్ భౌతికకాయాన్ని త్వరితగతిన స్వదేశానికి రప్పించేందుకు ఢిల్లీలోని ఉన్నతాధికారులు నిరంతరం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మెరైన్ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్నత హోదాలో ఉన్న సురేశ్ పట్నాల మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది. సురేశ్‌కు భార్యతో పాటు 13 సంవత్సరాలు, 10 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి ఇక లేరనే నిజాన్ని ఆ చిన్న పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న అధికారి ఇలా అంతర్జాతీయ వివాదాలు, దాడుల మధ్య ప్రాణాలు కోల్పోవడం పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
మెరైన్ ఇంజనీర్ మృతిపై ఆయన భార్య భార్గవీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మరణించే ముందు రోజు రాత్రి.. శుభరాత్రి, పిల్లలను బాగా చూసుకో అని సందేశం పంపారని ఆమె గుర్తు చేసుకుంది. ప్రతి రోజు.. గుడ్ మార్నింగ్ అంటూ సందేశం పంపేవారని పేర్కొన్నారు. ఆ రోజు కూడా ఆయన గుడ్ మార్నింగ్ అంటూ సందేశం పెడతారని తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఆయన నుంచి సందేశం రాక పోవడంతో బిజీగా ఉండి ఉంటారని భావించానని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆయన మరణించినట్లు వార్త వచ్చిందని.. దీంతో తాము దు:ఖ సాగరంలో ముగినిపోయామన్నారు.
ఆయన తన అభిరుచికి తగ్గట్లు మెరైన్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఆయన ఈ విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. దాదాపు 12 ఏళ్ల పాటు ఆయన ఒకే కంపెనీలో చేస్తున్నారని చెప్పారు. సురేశ్‌కు తల్లిదండ్రులతోపాటు ఒక సోదరి కూడా ఉందన్నారు.
AI Deepfake Scams : ఏఐ డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Bangladesh Lord Ram Statue: బంగ్లాదేశ్‌లో రాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత
US Iran Peace Deal : ఇరాన్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందం: ఈ వారాంతంలో యూరప్‌లో సంతకాలు
Trump Tariffs : టారిఫ్స్ విషయంలో ట్రంప్ కు భారీ ఊరట
Donald Trump: ఇరాన్‌పై అమెరికా దాడులు రద్దు.. శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్
Crude Oil Prices : ట్రంప్ ప్రకటన తో దిగొస్తున్న క్రూడాయిల్ ధరలు
US Attack Iran : ఇరాన్ కు ట్రంప్ బిగ్ వార్నింగ్