చర్మ కణాల మాదిరిగానే పెదాలు కూడా యూవీ కిరణాల వల్ల దెబ్బతింటాయి. కాబట్టి పెదాలకు ఎస్పీఎఫ్ లిప్‌బామ్‌ను వాడండి. ఇది పెదాలను అందంగా మార్చుతుంది. ధూమపానం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. సిగరెట్
ఎక్కువగా తాగడం వల్ల పెదాలపై నల్లటి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పొగ తాగవద్దు.
పెదాలను తరుచూ కొరకడం లేదా తాకడం వల్ల పెదాలు పొడిబారతాయి. పెదాలపై నల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.
పెదాలను సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేయండి. దీని వల్ల పెదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొలగుతాయి. పెదాలపై నల్ల మచ్చలు మాయం అవుతాయి.
నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీరు తాగడం వల్ల పెదాల పగుళ్లు తగ్గుతాయి. నల్ల మచ్చలు మాయం అవుతాయి.
రాత్రి పడుకునే ముందు పెదాలకు కొబ్బరి నూనె లేదా బాదం నూనె రాయండి. వీటిలోని పోషకాలు పెదాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
చాలా వేడిగా ఉన్న పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల పెదాలు నల్లగా మారే అవకాశం ఉంది.
విటమిన్ బి12 లేదా ఐరన్ లోపం వల్ల పెదాలు నల్లగా మారే అవకాశం ఉంది. కాబట్టి విటమిన్ బి12 ఎక్కువగా ఉన్న ఆహారాలు తినండి.
పెదాలను అందంగా మార్చుకునేందుకు క్వాలిటీ కలిగిన ఉత్పత్తులు ఉపయోగించండి. డెర్మటాలజిస్ట్‌ను కలిసి సరైన సలహాలు తీసుకోండి.