
ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ (Kakoli Ghosh) ఆ పార్టీ మాజీ ఎంపీపై సంచలన ఆరోపణలు చేశారు. తృణమూల్ మాజీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ హసన్ ఇమ్రాన్ (Ahmed Hassan Imran)కు
బంగ్లాదేశ్‌కు చెందిన అతివాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు పశ్చిమబెంగాల్ సీఎం సువేందు అధికారికి లేఖ రాశారు. ఇమ్రాన్‌కు బంగ్లాదేశ్ సంస్థలతో సంబంధాలు ఉండొచ్చని పలు మీడియా నివేదికలు చేసిన బహిరంగ ఆరోపణలను ఘోష్ తన లేఖలో ప్రస్తావించారు. టీఎంసీ హయాంలో చికెన్ నెక్ కారిడార్ (సిలిగుడీ కారిడార్)తో సహా కొన్ని సున్నితమైన ప్రాంతాలలో భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం (BSF) అభ్యర్థించిన భూమిని కేటాయించకపోవడం పైనా పలు అనుమానాలు లేవనెత్తారు. వీటిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.
రెబల్ ఎమ్మెల్యే రితబ్రత టీఎంసీలో తిరుగుబాటు లేవనెత్తిన అంశంతో తమకేమీ సంబంధం లేదని కకోలీ ఘోష్ పేర్కొన్నారు. ఆయన అసెంబ్లీలో ఉంటే తాను పార్లమెంట్లో ఉన్నానని అన్నారు. రెండు వర్గాలు వేర్వేరు రాజకీయ లక్ష్యాలను అనుసరిస్తున్నాయన్నారు.
ఇటీవల లోక్‌సభలోని 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. వారు స్పీకర్‌కు రాసిన లేఖ నేడు జాతీయమీడియా చేతికి వచ్చింది. దీంతో రెబల్ ఎంపీలలో కకోలీ ఘోష్, శతాబ్ధి రాయ్, భారత మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ (Yusuf Pathan), నటి సయోనీ ఘోష్, నటుడు శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) మొదలైన కీలక నేతలు ఉన్నట్లు వెల్లడయ్యింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.