
అమరావతి: ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి
వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామన్నారు. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నామని సీఎం స్పష్టంచేశారు. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ.. రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నామని తెలిపారు.
రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్’’ అంటూ చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.