
ప్రస్తుతం ఈ టస్సర్ ఫ్లోరల్ చీరలు ట్రెండ్ అవుతున్నాయి.ఏ వయసు వారికైనా బాగుంటాయి. ఇంకా నాజూగ్గా కనిపిస్తారు. ప్లేన్ సిల్క్ చీరకు ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ వస్తే చాలా బాగుంటుంది. సిల్క్ చీరలపై పెద్ద
పెద్ద లోటస్ ప్రింట్లు కూడా బాగా మెరుస్తాయి. మిమ్మల్ని ఎలివేట్ చేస్తాయి. ఇలాంటి చీరల్లో చిన్న ప్రింట్ల నుంచి పెద్ద ప్రింట్ల వరకు డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.
టస్సర్ సిల్క్ చీరలో ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తుంది. ఇలాంటి చీరలను స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పైర్ చేస్తే అదిరిపోద్ది.
వర్షాకాలంలో లావెండర్ సిల్క్ కలర్ చాలా ప్రకాశవంతంగా, గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. కాబట్టి మీ వార్డ్రోబ్ను ఫ్లోరల్ ప్రింట్ సిల్క్ చీరలతో నింపేయండి.
రెయిన్బో ప్రింట్ చీరలో పెద్ద పెద్ద రంగురంగుల పువ్వులు ఉంటాయి. ఇలాంటి చీరలను మీరు ఏదైనా ఫంక్షన్‌కు కూడా ధరించి వెళ్లవచ్చు.
చందేరి సిల్క్ చీరలు లైట్ వెయిట్‌గా ఉండి మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతాయి. ఇలాంటి చీరలతో కాంట్రాస్ట్ బ్లౌజ్‌ను ధరించండి. స్పెషల్ ఎట్రాక్షన్ మీరే. క్యూట్‌గా కనిపిస్తారు కూడా.
Hair Growth: ఇవి తింటే జుట్టు వద్దన్నా.. ఒత్తుగా పెరుగుతుంది
Silver Purse: అందమైన వెండి పర్సులు.. అదిరిపోయే క్లచ్ డిజైన్లు
Indoor Plants: మానసిక ప్రశాంతత కోసం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే!