
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ (Future City)ని రద్దు చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి
(Revanth Reddy) నిర్వాకం వల్ల రూ.70వేల కోట్ల ఫార్మా పెట్టుబడులు పోయాయన్నారు. ఫార్మా సిటీ (Pharma City) రద్దు చేసి భూములు వెనక్కి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. భూములు ఫార్మాకు కాకుండా మార్పులు చేస్తే చట్టం అంగీకరించదు. ఫార్మాసిటీ కోసం నేను కూడా 17 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడితే ఊరుకుంటామా? ఇప్పటికే పలువురు రైతులు ఈ భూములపై కేసులు వేశారు. జర్నలిస్టులపై ప్రేమ ఉంటే వివాదాలు లేని భూములు ఇవ్వొచ్చు కదా. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా మేం వ్యతిరేకించం. పాత భూములనే వారికి ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు.