
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Ambani Family In Tirumala Video: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఈరోజు తెల్లవారుజామున స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కూడా ఉన్నారు. టీటీడీ అధికారులు ఈ కుటుంబానికి ఘనస్వాగతం పలికి, వారి కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో కూటమి ప్రభుత్వ భారీ సభ ఉండటం వల్ల కొండపై వీఐపీల రాక కూడా పెరిగింది. దీనివల్ల సాధారణ భక్తులకు సర్వదర్శనం కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోంది. తిరుమలకు భక్తుల సంఖ్యతో పాటు వీఐపీల తాకిడి కూడా పెరుగుతుండటంతో క్యూ లైన్లు పొడవుగా సాగుతున్నాయి. నిన్న శ్రీవారిని సుమారు 75,428 మంది భక్తులు దర్శించుకున్నారు.. అందులో 42,566 మంది తలనీలాలు సమర్పించారు. నిన్నటి హుండీ ఆదాయం రూ. 4.50 కోట్లు కాగా, 4.34 లక్షల లడ్డూలు విక్రయించబడ్డాయి
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల నిర్వహణ.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ జేఈఓ డాక్టర్ ఎస్ శరత్ కుమార్ గురువారం ఏర్పాట్లు పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన సూచించారు. ముఖ్యంగా శనివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్యూ లైన్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉండాలని చెప్పారు. ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక అనుభూతి కలిగించడమే లక్ష్యమని, ప్రధాన ద్వారాల వద్ద ఆకర్షణీయమైన స్వాగత ఆర్చ్‌లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
యోగా ద్వారా ఆరోగ్యం.. మానసిక దృఢత్వం కోసం యోగా ఎంతో అవసరమని భావిస్తూ, టీటీడీ 'యోగా - టీటీడీ ఆరోగ్యానంద' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జూన్ 7 నుండి 21 వరకు సాగుతున్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టీటీడీ చైర్మన్ డాక్టర్ ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడానికి 14 రోజుల పాటు ప్రతిరోజూ గంట సేపు యోగా సాధన చేస్తున్నారు.
సకాలంలో పూర్తి చేయాలి.. శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు కూడా అందించడానికి వస్తున్న వైద్య నిపుణులకు అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు గురువారం టీటీడీ జేఈవో శరత్ కుమార్ అధికారులతో కలిసి వసతి కేంద్రాలను కూడా పరిశీలించారు. ఈ నెల 17వ తేదీన తొలి విడత వైద్య నిపుణులు రానున్న నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా వశిష్ట అతిథి గృహం ఆయుర్వేద కళాశాల అతిథిగృహం, స్విమ్స్ అతిథి గృహాల్లో అవసరమైన ఏర్పాటు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.