
దక్షిణ, ఈశాన్య భారతంలో ఎక్కువ ప్రాంతాలకు వేగంగా విస్తరించిన అనంతరం రుతుపవనాల పురోగతి మందగించింది. మధ్య, పశ్చిమ, వాయవ్య భారతంలోని అనేక ప్రాంతాలు ఇంకా రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. అరేబియా
సముద్రం, బంగాళాఖాతంలలో అసాధారణంగా దీర్ఘకాలం అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏర్పడకపోవడమే దీనికి కారణమని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ తెలిపింది. 2025 చివరిలో దిత్వా తుఫాను ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు గుర్తించేస్థాయిలో తుఫాను వ్యవస్థ ఏమీ ఏర్పడలేదని పేర్కొంది. ఇవి చదవండి ఏదో తేడాగా ఉంది.. భారత జీడీపీ గణాంకాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ అమెరికాతో డీల్ చేసుకోలేదు.. తేల్చి చెప్పిన ఇరాన్..