
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. రెండు రోజులుగా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా మొన్న కురిసిన వర్షానికి విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా నెహ్రూ బస్టాండ్ నుంచి పలు చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. ఇక నైరుతి ఋతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా చురుగ్గా కదులుతున్నాయి.
దీంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉండటంతో ప్రజలు చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్థంబాలకు దూరంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్లు కింద నించోద్దని చెబుతుంది.
ఈరోజు ఏలూరు, కృష్ణ, అల్లూరి, ఎన్టీఆర్, నంద్యాల, కడప, అన్నమయ్య, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తిరుపతితో పాటు తిరుమలలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు నడక దారిలో వెళ్లేవాళ్లు కొండ చరియలు విరిగిపడే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.