మేష రాశి వారికి మూడు గ్రహాల కలయిక వల్ల అత్యంత శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసే పనులన్నీ విజయవంతం కావొచ్చు. మీ సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు
వినిపించొచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు రానున్నాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఇదే రాశిలో గురుడు, శుక్రుడు సంచారం జరగనుంది. ఈ రాశికి సమీపంలో వృషభరాశిలో బుధుడి సంచారం జరగనుంది. ఈ మూడు గ్రహాలు అత్యంత సమీపంలో ఉండటం కారణంగా ఈ రాశి వారికి మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడం, మానసికంగా చురుగ్గా ఉండటం వంటి విషయాలు జరగనున్నాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి.
సింహ రాశి వారికి గురు, శుక్ర గ్రహాల కలయికతో పాటు బుధ గ్రహం కూడా చేరడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ గురించి కూడా శుభవార్తలు వినొచ్చు. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది.
తులా రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శుక్రుడి బలమైన స్థానం ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ మూడు గ్రహాల ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీడియా, కళా రంగాల్లో ఉండే వ్యక్తులకు ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. మీకు కొత్త ఆదాయ వనరులు లభించొచ్చు. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది.
ధనస్సు రాశి నుంచి గురు గ్రహం ఉచ్ఛ స్థితిలో ఉండటం, దీనికి తోడు శుక్రుడితో సంయోగం, మరోవైపు బుధుడు కూడా ఈ రెండు గ్రహాల సమీపంలో ఉండటంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ గ్రహాల కలయిక వల్ల గొప్ప ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలున్నాయి. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి