
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Elnino Effect: తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వైపు రెండు రోజుల క్రితం రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మండకొడిగా సాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు ఎల్నీనో ప్రభావమే కారణమంటోంది వాతావరణశాఖ. ఈ కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాలులు వీచే ప్రమాదం ఉందంటోంది.
మరో మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు.. నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర మంతటా వ్యాపించేందుకు మరో రెండు, మూడు రోజులు పడతాయంటోంది. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మరో మూడు రోజులపాటు వడగాలుల తీవ్రత కొనసాగుతాయని వెల్లడించింది. ఇవాళ రేపు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు నమోదు కావొచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఉష్ణోగ్రత అత్యధికంగా 42.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జూన్ నెలలో ఈ రేంజ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వెనక ఎల్‌నినో ప్రభావం ఉందని చెబుతుున్నారు. ఇక 21 జిల్లాల్లో 42.2-42.8 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక నాలుగు జిల్లాల్లో 41-41.8 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఇలా వుండగా దక్షిణ తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు కారణంగా వానలు కురుస్తున్నాయి. గురువారం ఖమ్మం జిల్లా కల్లూరులో అత్యధికంగా 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించనున్నాయని .. ఈ నేపథ్యంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.